కన్నడ బ్యూటీ రష్మిక మండన్న ఏం చేసినా అది సూపర్ హిట్టే. కన్నడ సినిమాల నుంచి, తెలుగు సినిమాల్లోకొచ్చి.. ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో ఛాన్సులు కొట్టేసి, ఇప్పడేమో ఏకంగా బాలీవుడ్ మీద కన్నేసింది. కన్నేయడమేంటి.? (Rashmika Mandanna Top Tucker) ఆల్రెడీ రెండు సినిమాలు రష్మిక మండన్న చేతిలో వుంటేనూ.!
రష్మిక స్పీడు ఆ స్థాయిలో వుంది మరి. తాజాగా రష్మిక ‘టాప్ టక్కర్’ అంటూ సందడి చేసేస్తోంది. ఇదొక మ్యూజిక్ వీడియో. ప్రస్తుతానికి ఈ మ్యూజిక్ వీడియో తాలూకు టీజర్ మాత్రమే వచ్చింది.. త్వరలో పూర్తి మ్యూజిక్ వీడియో రాబోతోంది. టీజర్ అయితే వచ్చిందిగానీ, అందులో రష్మిక చాలా తక్కువ సేపు మాత్రమే కన్పించింది.
ఎంత సేపు కన్పించామన్నది ముఖ్యం కాదు, ఎంత ఇంపాక్ట్ చూపించామన్నదే ముఖ్యం.. అన్నట్టు, రష్మిక కన్పించిన ఆ కాస్సేపే కుర్రకారుకి బీభత్సంగా కిర్రాకు పుట్టించేసింది. రష్మిక (Rashmika Mandanna Top Tucker) చూపులు అలాంటివి మరి. ఆమె హావభావాలు, మ్యానరిజమ్స్.. ఇలా ఒకటేమిటి.? అన్నీ ప్రత్యేకమే.
గ్లామర్ పరంగా చెప్పుకోవాలంటే, రష్మిక కాస్తంత హాటుగానే కనిపించేలా వుంది. టీజర్ మాత్రం ఓ మోస్తరుగా రష్మిక (Rashmika Mandanna Glamour) అందాల్ని పరిచయం చేసింది. స్టైలింగ్ విషయానికొస్తే, రష్మిక మండన్న కెవ్వు కేక అంతే. ఈ బ్యూటీకి మంచి మ్యూజిక్ టేస్ట్ వుంది.. అందుకే పాటలంటే, చెలరేగిపోతుంది డాన్సుల పరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగా, మేనరిజమ్స్ పరంగా.
మ్యజిక్ ఆల్బమ్ కోసం పేరు మోసిన పాటగాళ్ళు, ఇతర టెక్నీషియన్లు పనిచేసినా, రష్మిక (Rashmika Mandanna Hot) పేరు మాత్రమే విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. దటీజ్ రష్మిక (Rashmika Mandanna Top Tucker). ఆమెకున్న పాపులారిటీ అలాంటిది. ఇటు దక్షిణాదిలోనే కాదు, అటు ఉత్తరాదిలో కూడా రష్మిక గట్టిగానే తన సత్తా చాటేలా వుంది.
తన వరకూ ఏ భాషలో నటించినా ఒకేలా వుంటుందనీ, ఏ సినిమా చేయాలనుకున్నా.. ఆ భాష నేర్చుకోవాలనే తపనతో తాను వుంటాను గనుక, ఆయా భాషల్ని నేర్చేసుకోవడం ద్వారా, అక్కడి పరిస్థితులను కూడా వేగంగా అర్థం చేసుకోగలనని అంటోంది రష్మిక (Rashmika Mandanna Spicy).
అంతేనా, ఆయా ప్రాంత స్వభావాలు తనకు తొందరగానే అలవాటైపోతాయనీ, అలా తనకు ఏ భాషలో అయినా నటన పరంగా పెద్దగా ఇబ్బందులు వుండవనీ చెబుతోంది ఈ కన్నడ కస్తూరి (Rashmika Mandanna Top Tucker). చక్కనమ్మ ఏం చెప్పినా అందంగానే వుంటుందనుకోండి.. అది వేరే సంగతి.
తెలుగులో ‘పుష్ప’ (Pushpa) సినిమాలో రష్మిక నటిస్తున్న విషయం విదితమే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. కన్నడలో రష్మిక నటించిన ‘సుల్తాన్’ (కార్తీ హీరో) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.