Recission Software.. అరరె.! ట్విట్టర్ నుంచి దాదాపు సగం మందిని పీకి పారేశారుట.! ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఏమైనా తక్కువ తిందా.? వాళ్ళూ తమ ఉద్యోగుల్లోంచి చాలామందికి హూస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు.!
మొన్న బైజూస్.. ఆ తర్వాత ట్విట్టర్, ఫేస్‌బుక్.. వీటి గురించి మాత్రమే చర్చించుకుంటున్నాంగానీ.. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు వేగంగా, ఘోరంగా మారుతున్నాయ్.
ఆర్థిక మాంద్యం ఇంకోసారి ప్రపంచాన్ని కమ్మేయనుందా.? అంటే, అసలంటూ ఆర్థిక మాంద్యం నుంచి ప్రపంచం గట్టెక్కిందెక్కడ.?
Recission Software.. తగ్గింపు వెనుక కార్పొరేట్ నాటకం..
చమురు సంక్షోభం కావొచ్చు, అర్థం పర్థం లేని యుద్ధాలు కావొచ్చు.. వీటికి తోడు, ఆయా దేశాలు అనుసరిస్తున్న అడ్డగోలు ఆర్థిక విధానాలు కావొచ్చు.. వెరసి, ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ట్విట్టర్ సంస్థ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వెళ్ళాక, ‘నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి’ అంటూ పీకి పారెయ్యడం మొదలు పెట్టారు. బైజూస్ కూడా ఇదే కథ చెప్పింది. మెటా కూడా అలాంటి కథే చెబుతోంది.
ఇంతకీ, ఉద్యోగాలు కోల్పోయినవారి పరిస్థితేంటి.? అందులో చాలామంది రోడ్డున పడతారు. ప్రత్యక్షంగా వేల మందికి సమస్య వస్తే, పరోక్షంగా లక్షల మందికి.. కోట్ల మందికి సమస్య ఏర్పడుతుంది.
ఆర్థిక మాంద్యం.. విశ్వ వ్యాపితం.!
గతంలో ఇదే పరిస్థితిని చూశాం. ఇంకోసారి అలాంటి పరిస్థితినే చూడబోతున్నాం. ప్రస్తుతానికైతే అన్ని సంస్థలూ అప్రమత్తమయ్యాయ్.
Also Read: మీకు తెలుసా.? భూమ్మీద చీమల జనాభా 20 క్వాడ్రిలియన్స్.!
ఖర్చులు తగ్గించుకుంటే, ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకోవచ్చన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. నిజానికి, ఇదొక కుంటి సాకు.. ఉద్యోగుల్ని తొలగించడానికి.
పెరుగుట విరుగుట కొరకే.. అన్నది పెద్దలు చెప్పే మాట. ఇప్పుడది అక్షరాలా నిజమవుతోంది. నిరుద్యోగ భూతం ప్రపంచాన్ని భయపెట్టబోతోంది.
ఓ వైపు సాఫ్ట్‌వేర్ రంగంలో అద్భుతాలు చేసెయ్యొచ్చంటూ విద్యార్థుల్ని అటువైపుగా వారిని బలవంతంగా తీసుకెళుతున్న సమాజం.. ఎప్పటికప్పుడు ఆ రంగంలో ఒడిదుడుకులు.. ఇదో చిత్రమైన మాయ అంతే.!