Home » కుల రాజకీయ కుంపటి: ‘రెడ్డి నేత’ జగన్‌తో ‘కాపు నేత’ అంబటి.!

కుల రాజకీయ కుంపటి: ‘రెడ్డి నేత’ జగన్‌తో ‘కాపు నేత’ అంబటి.!

by hellomudra
0 comments
Ys Jagan Ambati Rambabu

Reddy Jagan Kapu Rambabu.. రాజకీయాలంటే, కుల మతాలకతీతంగా వుండాలి.! కానీ, అసలంటూ రాజకీయమే కులం కోణంలో, మతం కోణంలో కదా నడుస్తున్నది.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇదే వాస్తవం.! ఆ రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీ.. అని కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, కులం పేరుతో, మతం పేరుతో రాజకీయం చేయాల్సిందేనేమో.!

ఫలానా నాయకుడు అరెస్టయ్యాడంటే, ముందుగా అతని కులాన్నో.. మతాన్నో తెరపైకి తీసుకురావాలి. కుల ముద్ర లేకుండా అసలు రాజకీయాలే నడవడం లేదు తెలుగు రాష్ట్రాల్లో.

అందునా, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరింత అసహ్యకరంగా తయారయ్యాయి. రాజధాని అమరావతి మీద ఏకంగా ‘కమ్మరావతి’ అనే ముద్ర వేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

Ys Jagan Ambati Rambabu.. రాజకీయ జుగుప్స..

ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యారు, జైలుకు వెళ్ళారు.

అంతే, రాత్రికి రాత్రి అంబటి రాంబాబుని ‘కాపు మహా నాయకుడ్ని’ చేసేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పటినుంచే, ‘కాపు నాయకుడు అంబటి’ అంటూ పిలుస్తోంది వైసీపీ.

బెయిల్ వచ్చాక, జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

ఈ విషయాన్ని తెలియజేసే క్రమంలో, ‘వైఎస్ జగన్ గారిని కలిసిన కాపు నేత అంబటి రాంబాబుగారు’ అంటూ పేర్కొంది వైసీపీ.

అంబటి రాంబాబు పేరు చివర్న ‘కులం తోక’ లేదు. కానీ, వైఎస్ జగన్ విషయంలో అలా కాదు, ‘రెడ్డి’ అనే కులం తోక ఆయన పేరు చివర్న వుంది.

‘రెడ్డి నేత’ జగన్.!

ఆ లెక్కన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘రెడ్డి నేత’ అని కదా వైసీపీ ప్రస్తావించాలి.? నిజానికి, వైఎస్ జగన్ అనుసరిస్తున్నది క్రైస్తవ మతం.

క్రైస్తవ మతంలో అసలు కులాల ప్రస్తానే వుండదు. అలాంటప్పుడు, వైఎస్ జగన్ ఎలా ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’గా చెలామణీ అవుతున్నారన్నది రాజకీయ ప్రత్యర్థులు సంధించే ప్రశ్న. ఎవరి గోల వారిది.

వైసీపీని రెడ్ల పార్టీగా, టీడీపీని ‘కమ్మ’ పార్టీగా, జన సేనని ‘కాపు’ పార్టీగా ఆల్రెడీ ఫిక్స్ చేసేశారు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలామంది.

కేవలం రెడ్లు మాత్రమే వైసీపీలో వుంటారా.? కేవలం కమ్మోళ్ళు మాత్రమే టీడీపీలో వుంటారా.? కాపులు మాత్రమే జనసేనలో వుంటారా.? మరి, మిగతా కులాల సంగతేంటి.?

ఒక్కటి మాత్రం నిజం.. ఇకపై, ఏ రాజకీయ నాయకుడి గురించి ప్రస్తావించాల్సి వచ్చినా, అతని సామాజిక వర్గాన్ని ముందుగా ప్రస్తావించే రోజులు ముందు ముందు రాబోతున్నాయి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group