వచ్చేసింది అసలు సిసలు అప్‌డేట్. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి బీభత్సమైన అప్‌డేట్‌ని (RRR Climax Fight Sensation) అభిమానులతో పంచుకున్నాడు దర్శకుడు రాజమౌళి. అలాంటిలాంటి అప్‌డేట్ కాదిది.
రామ్ (సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – భీమ్ కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్) కలిసి చేస్తున్న ఫైట్ ప్రారంభమయ్యిందన్నది ఆ అప్‌డేట్ సారాంశం.
రాజమౌళి ఇంత ప్రత్యేకంగా చెబుతున్నాడంటే, దీనికోసం ఆయనెంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మగధీర’ సినిమా కోసం 100 మంది ప్రత్యర్థి యోధులతో హీరో చేసే ఫైట్.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ అత్యద్భుతం.
అంతకు మించిన అద్భుతాన్ని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో మనం చూడబోతున్నామన్నమాట. ‘మగధీర’తో పోల్చితే ‘బాహుబలి’ పోరాటాలు మరింత బీభత్సమైనవేననుకోండి.. అది వేరే సంగతి. ఒక ‘మగధీర’, ఒక ‘బాహుబలి’.. ఇప్పుడు అంతకు మించి.. ‘ఆర్ఆర్ఆర్’ వుండబోతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) హీరోయిన్‌గా నటిస్తోంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ (Ajay Devgn), సముద్రఖని సహా పలువురు సినీ ప్రముఖులు ఈ ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత డివివి దానయ్య (DVV Danayya RRR) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌కి తీవ్ర ఆటంకం ఏర్పడింది. లేకపోతే, ఈపాటికే సినిమా షూటింగ్ పూర్తయిపోయేది.. ఆ మాటకొస్తే, ఈ సంక్రాంతికే సినిమా విడుదల చేయాలని ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ప్లాన్ చేశారు కూడా.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (MM Keeravani) బాణీలు సమకూర్చుతున్న సంగతి విదితమే. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ (RRR), హిందీ, తమిళ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో (RRR Movie)విడుదల కానుంది.