Sahithi Dasari Telugu Beauty.. లోకల్ టాలెంట్ అంటే మనోళ్లకి ఎప్పుడూ లోకువే.! అందుకే చాలా మంది తెలుగమ్మాయిలు స్టార్ రేస్‌లో వెనకే వుండిపోయారు.
ఏం.. పరభాషా ముద్దుగుమ్మలతో పోల్చితే ఎందులోనూ లోకల్ అందగత్తెలు తక్కువ కాదు కదా..!
అలా తక్కువ కాదని లోకల్ ముద్దుగుమ్మలు పలుమార్లు ప్రూవ్ చేసుకున్నారు చేసుకుంటూనే వున్నారు కూడా. తాజాగా మరో లోకల్ టాలెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఆమె మరెవరో కాదు, సాహితి దాసరి. ‘పొలిమేర’ సినిమాలో నటించింది. అంతకు ముందే ‘సర్కారు నౌకరీ’ అనే సినిమాలోనూ నటించింది.
పాలిటిక్స్.! నాట్ ఇంట్రెస్టెడ్.!
ఇప్పుడిప్పుడే చిన్న చిన్న సినిమాలతో పాపులారిటీ పెంచుకుంటోన్న ఈ ముద్దుగుమ్మకు యాక్టింగ్ టాలెంట్ కూసింత ఎక్కువే మరి.

నేచురల్ యాక్టింగ్‌తో సత్తా చాటుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ సాహితి చాలా చాలా యాక్టివ్. ఈ మధ్య ‘గుంటూరు కారం’ సినిమాలోని ఓ సాంగ్‌కి డాన్స్ చేస్తూ.. అనూహ్యంగా పొలిటికల్ వివాదాల్లో చిక్కుంది.
తాను డాన్స్ చేసిన టెర్రస్ బ్యాక్ గ్రౌండ్‌లో ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన పోస్టర్ వుండడంతో ఆ పార్టీని ప్రమోట్ చేస్తున్నావా.? అంటూ కామెంట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.
Sahithi Dasari Telugu Beauty.. సోషల్ ఫాలోయింగ్‌లో సూపర్ రేంజ్.!
ఈ ఇష్యూని పెద్దగా ల్యాగ్ చేయకుండా.. తాను ఏ పొలిటికల్ పార్టీనీ ప్రమోట్ చేయడం లేదనీ, తనకసలు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదని కుండ బద్దలు కొట్టేసింది.
కానీ, తనకు పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అంటే చాలా ఇష్టమనీ.. ఆయనకు వీరాభిమానిగా అభివర్ణించుకుంది సాహితి.

మంచి టాలెంట్ వున్న ముద్దుగుమ్మ. ఎంకరేజ్ చేస్తే మంచి ఫ్యూచర్ వుంటుంది. సినిమాల సంగతెలా వున్నా.. సోషల్ మీడియాలోనూ ఈ తెలుగమ్మాయ్‌కి ఫాలోయింగ్ బాగానే వుంది.
Also Read: సిగ్గు లేదా? క్యాన్సర్‌తో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తావా.?
తన నెట్టింటి ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడే హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఆ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంటుంది సాహితి దాసరి.
తాజాగా సాహితి పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేస్కోండి.