Home » మీడియా దెబ్బకి దిగొచ్చిన సమంత.! అది ఒప్పేసుకోక తప్పలేదు.!

మీడియా దెబ్బకి దిగొచ్చిన సమంత.! అది ఒప్పేసుకోక తప్పలేదు.!

by hellomudra
0 comments
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu Pregnancy.. సినీ నటి సమంత ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొంత కాలం క్రితం ఆమె మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడింది.

ప్రాణాంతకం కాకపోయినా, ఆ స్థాయి అనారోగ్య సమస్యే అది. ‘ఇక, సమంత సినిమాలు చేయడానికి పనికిరాదు’ అని ఓ వర్గం మీడియా తీర్మానించేసింది.

కానీ, సమంత ఆ అనారోగ్య సమస్య నుంచి ‘పట్టుదలతో’ కోలుకుంది. గుండె నిండా ధైర్యాన్ని నింపుకుని ముందడుగు వేసింది.

నిజానికి, సమంతకి ఏదీ అంత తేలిగ్గా దొరకలేదు. అది, సినిమాల్లో సక్సెస్ అవడమైనా, వ్యక్తిగత జీవితంలో ఆటు పోట్ల విషయంలో అయినా.!

నాగచైతన్యతో విడాకుల అనంతరం, సమంత ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇంకా ఆమె మీద ఆ విషయమై ట్రోలింగ్ జరుగుతూనే వుంది.

సమంత నుంచి విడిపోయాక, శోభితను పెళ్ళి చేసుకున్నాడు నాగచైతన్య. ఆ తర్వాత కూడా సమంత మీద ట్రోలింగ్ ఆగలేదు. కొన్నాళ్ళ క్రితమే, రాజ్ నిడిమోరుని సమంత వివాహం చేసుకుంది.

ట్రోలింగ్ మాత్రం యధాతథంగా సమంత మీద కొనసాగుతూనే వుంది, నాగచైతన్యతో విడాకుల విషయమై. ఆ విషయాల్ని సమంత ప్రస్తావించడానికి పెద్దగా ఇష్టపడటం లేదనుకోండి.. అది వేరే సంగతి.

Samantha Ruth Prabhu Pregnancy.. మోస్ట్ మెమరబుల్ ఫేజ్.. అయినాగానీ..

ఇంకోపక్క, సమంత వ్యక్తిగత జీవితంలో మోస్ట్ మెమరబుల్ ఫేజ్‌లో వుంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్. తమ ప్రెగ్నెన్సీని సెలబ్రిటీలు బయటపెట్టేందుకు, సరైన సమయాన్ని నిర్ణయించుకుంటారు.

కానీ, సమంత ప్రెగ్నెంట్ అట.. అంటూ, గాసిప్పులు.. ఆపై ట్రోలింగ్.. అత్యంత జుగుప్సాకరంగా మారిపోయింది. ‘మా ఇంటి బంగారం’ ప్రమోషనల్ ఈవెంట్‌లో, ఇదే విషయమై మీడియా నిలదీసేసింది.

దాంతో, సమంతకి తన ప్రెగ్నెన్సీ గురించి మీడియాతో చెప్పక తప్ప లేదు. ‘మీడియా దెబ్బకి దిగొచ్చి, నిజం ఒప్పేసుకున్న సమంత..’ అంటూ, సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయ్.

ఇదొక ఉన్మాదం. ఔను, ఈ సోషల్ మీడియా ఉన్మాదానికి హద్దూ అదుపూ లేకుండా పోతోంది. మీడియా ముసుగులో ప్రశ్నలు సంధించే, రాబందుల ఉన్మాదం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అసలిది అడగాల్సిన ప్రశ్నేనా.? సున్నితమైన అంశం కదా, ఆమె చెప్పేవరకూ ఆగుదాం.. అన్న ఇంగితం లేనప్పుడు, అది జర్నలిజం ఎలా అవుతుంది.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group