Surekha Vani Video Leak.. నటి సురేఖా వాణి పేరు గత కొద్ది కాలంగా సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అదీ, సినిమాల పరంగా కాదు.. రాజకీయ కోణంలో.!
సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై పొలిటికల్ ట్రోలింగ్ కోసం ఈ మధ్యన నటీమణుల్ని గట్టిగా, చాలా గట్టిగా వాడేస్తున్నారు.
ఫలానా హీరోయిన్‌తో పలానా పొలిటీషియన్‌కి అక్రమ సంబంధాలు.. అంటూ, కోకొల్లలుగా ‘గాలి వార్తల్ని’ చూస్తున్నాం.
రకుల్ ప్రీత్ సింగ్, కాయదు లోహార్, శ్రియ శరణ్.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా చాలా పెద్దదే. చిత్రంగా, ఈ లిస్టులోకి నటి సురేఖా వాణి పేరు కూడా ఎక్కేసింది.
నిజానికి, పైన చెప్పుకున్న మిగతా హీరోయిన్ల కంటే, రాజకీయాల్లో సురేఖా వాణి పేరునే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు కొందరు.. అదీ, పనిగట్టుకుని మరీ.!
Surekha Vani Video Leak.. ఏఐ వీడియోనా.? లీక్ అయ్యిందా.? హ్యాక్ చేసిందెవరు.?
సరిగ్గా, ఈ సమయంలోనే సురేఖా వాణి సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఓ వీడియో బయటకు వచ్చింది. దాంట్లో, ఓ యువకుడితో, సురేఖా వాణి ‘ఇంటిమేట్’ పొజిషన్‌లో కనిపించింది.
ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ యుగం.! చాలా తేలిగ్గా ఇలాంటి వీడియోల్ని ‘మార్ఫింగ్’ ద్వారా ఎవరైనా క్రియేట్ చేసెయ్యొచ్చు.
అయితే, ఈ విషయమై సురేఖా వాణి స్పందిస్తూ, తన సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాక్ అయ్యిందంటూ వివరణ ఇచ్చుకుంది.
ఆ వివరణలో, ‘ప్రైవేట్ వీడియో.. నా అనుమతి లేకుండా..’ అనే మాటల్ని ప్రస్తావించింది సురేఖా వాణి. దాంతో, విషయం కొత్త మలుపు తిరిగింది.
పోలీసులు ఏం తేల్చుతారో..
సినీ రంగంలో ప్రముఖ నటిగా సురేఖా వాణి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. హాట్ ఆంటీ రోల్స్‌లోనూ సురేఖా వాణి మెప్పించడం తెలిసిన సంగతే కదా.!
సురేఖా వాణి కుమార్తె సుప్రీత కూడా ఇప్పుడు నటిగా అవకాశాల్ని సంపాదించుకుంటోంది. సురేఖా వాణితోపాటు ఆమె కుమార్తెపైనా ట్రోలింగ్ జరుగుతుంటుందనుకోండి.. అది వేరే సంగతి.
ఇదిలా వుంటే, సురేఖా వాణి తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నవారిపైనా, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నవాళ్ళపైనా, మార్ఫింగ్ వీడియోల్ని సర్క్యులేట్ చేస్తున్నవాళ్ళపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల విచారణలో ఏం తేలుతుందోగానీ, ఈ తరహా ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా పోలీసుల ముందున్నాయ్ చాలామంది నటీమణుల నుంచి.