Priyanka Chopra Diwali Prawns.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మళ్ళీ వార్తల్లోకెక్కింది.! అదీ, వివాదాస్పదంగా.! మరీ, అంత దారుణం ఏం చేసిందబ్బా.?
అబ్బే, మరీ దారుణం ఏమీ కాదు లెండి.! దారుణం కాకపోవడమేంటి.? పండగ పూట అలా ఎలా చేస్తుంది.? ఖ్యాతి దేశాలు దాటితేనేం, బుద్ధి మురికి కాల్వలోనే ఏడ్చింది కదా.!
ప్చ్, ప్రియాంక చోప్రా మీద ఇలా కామెంట్లు పడుతున్నాయ్ సోషల్ మీడియా వేదికగా. ఇంతకీ, ప్రింయాక చోప్రా చేసిన ఆ నేరమేంటి.?
దీపావళి పండక్కి, స్నేహితులతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంది ప్రియాంక చోప్రా.. అదీ, విదేశాల్లో.! ఇందులో తప్పేముందట.?
Priyanka Chopra Diwali Prawns.. తప్పు కదా ప్రియాంకా..
తప్పు లేకపోవడమేంటి.? చాలా పెద్ద తప్పు చేసేసింది.! చూస్తున్నారు కదా, ఫొటోలో.! పెద్ద రొయ్యని, అమాంతం లాగించేస్తోంది.! దీపావళి పండక్కి, ఎవరైనా నాన్ వెజ్ తింటారా.? నాన్సెన్స్ కాకపోతే.!
ఇదీ, అసలు గోల.! వాస్తవానికి, దీపావళి రోజున కొందరు నాన్ వెజ్ తింటారు.! అది ఆ కొందరికి ఓ పద్ధతి, ఓ సాంప్రదాయం.. అని కూడా అనొచ్చు.!

ఔను, ఎవరిష్టం వాళ్ళది.! అయినా, ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీ.! ఆమె భర్త, అసలు భారతీయుడే కాదు.! సో, స్నేహితులతో సెలబ్రేషన్.. అంటే, అన్నీ వుండాలి మరి.!
ప్రియాంకకి అన్నీ తెలుసు.! తాను చేసే పని వల్ల ట్రోలింగ్ జరుగుతుందని కూడా ఆమెకి తెలుసు. తెలిసీ, ఇలా ఎందుకు చేస్తుంది.? అంటే, అది ఆమె ఇష్టం.
తెలిసే చేసిందా..
సోషల్ మీడియా వేదికగా, సెలబ్రేషన్స్ తాలూకు ఫొటోల్ని పోస్ట్ చేయడంలోనే, ఆమె ఉద్దేశ్యం ఏంటన్నది సుస్పష్టమయిపోతోంది.!
ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా, నాన్ వెజ్.. వెజ్.. తిండి అనేది ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే, సెలబ్రిటీ కదా.. ట్రోలింగ్ జరుగుతుందని తెలిసీ, అలా ఆ ఫొటోల్ని పోస్ట్ చేయడం సబబు కాదన్నది కొందరి వాదన.
ప్రియాంక, ఆమె బర్త, అలానే ప్రియాంక కూతురు కూడా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన దివాళీ వేడుకల్లో సందడి చేశారు.!
ట్రోలింగ్‌ని పక్కన పెడితే, విదేశాల్లో కూడా మన దీపావళి సెలబ్రేషన్స్.. అంటే, ఆ కిక్కే వేరప్పా.! ఇదే, అక్కడివారికి ఒకింత కంటగింపుగా మారుతోందనుకోండి.. అది వేరే సంగతి.
అన్నట్టు, ప్రియాంక చోప్రా తన కంటే వయసులో చాలా చిన్నవాడైన నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.