Sana Makbul Khan Dikkulu.. ఎవరీ బ్యూటీ.? ఇంతకీ, ఎవరీ సొట్ట బుగ్గల సుందరి.? ఓ తెలుగు సినిమాలో నటించింది లెండి.! ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు.
తన పుట్టిన రోజున ఇదిగో, ఇలా కేకుల మధ్య సొట్ట బుగ్గల సోయగాన్ని చిరు దరహాసంతో ప్రదర్శించేస్తోంది.
పేరేమో సనా మక్బూల్.! పూర్తి పేరు సనా మక్బూల్ ఖాన్. సనా ఖాన్ పేరుతోనూ చెలామణీ అవుతుంటుంది. తెలుగులో ఆమె నటించిన సినిమా ‘దిక్కులు చూడకు రామయ్యా’.!
Sana Makbul Khan Dikkulu.. తండ్రీ కొడుకుల ‘ప్రేమ’.!
ఓ తండ్రి, ఓ కొడుకు.. ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడతారు.! అదీ, ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమా కథ.
అజయ్ తండ్రి పాత్రలో నటిస్తే, నాగ శౌర్య తనయుడి పాత్రలో నటించాడు ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాలో.
2014 అక్టోబర్‌లో వచ్చిన ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా ఒకింత ఫర్వాలేదనిపించిందనుకోండి.. అది వేరే సంగతి.

సినిమాలు, మోడలింగ్.. ఇలా బిజీగానే వుందట ప్రస్తుతం సనా మక్బూల్. తెలుగులో కాదు లెండి, తమిళ సినిమాలు.. అలాగే కొన్ని కన్నడ సినిమాల్లోనూ నటిస్తోందీ బ్యూటీ.
సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా వుంటోంది సనా మక్బూల్. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయనీ, మళ్ళీ తెలుగు తెరపై కనిపిస్తానని చెబుతోందీమె.
టెలివిజన్ షోస్, మ్యూజిక్ ఆల్బమ్స్.. వెరసి, కెరీర్ పరంగా టైమ్ పాస్ అయిపోతోందిట సనా మక్బూల్‌కి.