Sania Mirza.. టెన్నిస్ సంచలనం సానియా మీర్జా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేముంది.? భారతదేశం తరఫున టెన్నిస్‌లో ఎన్నో అద్భుత సంచలనాలు సృష్టించింది సానియా మీర్జా.
మన హైద్రాబాదీ సానియా మీర్జా.. అని తెలుగు ప్రజలంతా గుర్వంగా చెప్పుకునే ఈ టెన్నిస్ సంచలనం, దేశవ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని కలిగి వుంది.
ఓ సచిన్ టెండూల్కర్.. ఓ సానియా మీర్జా.. ఇలా మాట్లాడుకోవాలేమో.. క్రీడా రంగంలో ఆమె సాధించిన విజయాలు అలాంటివి మరి.!
సానియా మీర్జా ఆటతీరు మాత్రమే కాదు.. ఆమె స్టైలింగ్.. కుర్రకారుని ఉర్రూతలూగించింది.
సానియా ధరించే కాస్ట్యూమ్స్.. ఆమె ముక్కు పుడక.. ఇవన్నీ అప్పట్లో ట్రెండింగ్ వ్యవహారాలు.!
Mudra369
కేవలం ఆట మాత్రమేనా.? సానియా మీర్జా అంటే.. టెన్నిస్ ఆట మాత్రమే కాదు.. అంతకు మించి.! ఔను, యూత్ ఐకాన్‌గా సానియా మీర్జా ఓ వెలుగు వెలిగింది.
Sania Mirza.. హీరోయిన్లతో పోల్చితే.. ఆమెకేం తక్కువ.?
గ్లామర్ విషయంలో సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదన్నట్టుగా సానియా మీర్జా మేనియా కొనసాగింది అప్పట్లో. చాలా సినిమాల్లో ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయ్.
అయితే, కేవలం ఆట మీదనే ఫోకస్ పెట్టిన సానియా మీర్జా, సినిమా రంగం వైపు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఒకవేళ సినిమాలపై దృష్టి కేంద్రీకరించి వుంటే.. వ్యవహారం వేరేలా వుండేది.

ఇదిలా వుంటే, సానియా మీర్జా ఓ టాలీవుడ్ యంగ్ హీరోని పెళ్ళాడబోతోందంటూ గతంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది ఉత్తదేనని తేలిపోయింది.
పెళ్ళి విషయంలోనూ సానియా సంచనాలకు కేంద్ర బిందువుగా మారింది. హైద్రాబాదీ యువకుడితో జరగాల్సిన పెళ్ళి చివరి నిమిషంలో రద్దయ్యింది.
షోయబ్‌తో సంగతేంటి.?
అనూహ్యంగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తెరపైకొచ్చాడు. ఇద్దరికీ పెళ్ళి జరిగింది. ఆ తర్వాత రచ్చ మళ్ళీ వేరే లెవల్‌లో జరిగిందనుకోండి.. అది వేరే సంగతి.
ప్రస్తుతం సానియా – షోయబ్ కలిసే వున్నారా.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు. సానియా టెన్నిస్‌కి గుడ్ బై చెబుతూ, వీడ్కోలు మ్యాచ్ ఆడేసింది.
Also Read: Rakul Preet Singh Newboo.. కొత్త యాపారం గురూ.!
వాట్ నెక్స్‌ట్.? సానియా మీర్జా సినిమాల్లోకి వస్తుందా.? ఏం చేయబోతోంది సానియా.! ఏమోగానీ, ఇప్పటికీ సానియా అంటే.. యూత్ ఐకాన్.!