Sarkaru Vaari Paata Politics.. సినిమా వచ్చింది.! రాజకీయం తెచ్చింది.! సినిమాటిక్ రాజకీయం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సినిమాల్నీ,
రాజకీయాల్నీ విడదీసి చూడలేం. అయితే, ఇక్కడ సినిమాటిక్ రాజకీయం పరిస్థితి వేరు. ఇది అత్యంత జుగుప్సాకరం.!
శతృవుకి శతృవు మిత్రుడు అన్న చందాన, లేని శతృత్వాన్ని వున్నట్టు చూపి, ఇద్దరు స్టార్ల మధ్య, రెండు కుటుంబాల మధ్యా, సినీ కళామతల్లి బిడ్డల మధ్యా రాజకీయం చిచ్చుపెడుతోంది.
Sarkaru Vaari Paata Politics.. ఎవరి పైత్యమిది.?
!నీ వేలితోనే, నీ కంట్లోనే పొడిచేయడం..’ అన్న సినిమాటిక్ రాజకీయ సూత్రాన్ని, సినిమాల మీద ప్రయోగిస్తున్నారు కొందరు. ఆ కొందరు ఎవరో కాదు, కొన్ని రాజకీయ శక్తులు.
మెగా సినిమాల విషయంలో, నందమూరి అభిమానుల పేరుతోనో, ఘట్టమనేని అభిమానుల పేరుతోనో జుగుప్సాకరమైన ప్రచారానికి తెరలేపి, మెగా అభిమానుల్ని రెచ్చగొడ్డం చూస్తున్నాం.

దానికి కొనసిగింపుగా, మెగా అభిమానుల పేరుతో, ఘట్టమనేని సినిమాలపై దుష్ప్రచారం జరుగుతోంది.
‘సర్కారు వారి పాట’ సినిమాపై విషం ఇలాగే చిమ్మారు. పైగా, ‘సర్కారు వారి పాట’ సినిమాకి మద్దతిస్తున్నట్లుగా ఓ రాజకీయ శక్తి బిల్డప్ ఇస్తోంది.
అభిమానులే బలిపశువులవుతున్నారు.!
ఈ మొత్తం వ్యవహారంలో నందమూరి అభిమానులూ బలిపశువులవుతున్నారు.. మెగా, ఘట్టమనేని అభిమానులతో సహా.!
అంతెందుకు, మెగా కుటుంబంలో చిచ్చు పెట్టి, మెగా అభిమానులు వర్సెస్ పవర్ స్టార్ అభిమానులుగా మార్చేశాయి కొన్ని రాజకీయ శక్తులు. ‘మా’ రాజకీయాల్లో నడిచిన పైత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Also Read: చిరంజీవి దేవుడట.! పవన్ కళ్యాణ్ దెయ్యమట.!
సినిమాల్ని, రాజకీయాల్ని విడదీసి చూడలేంగానీ, సినిమాకి శాపంగా మారుతోన్న రాజకీయానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిందే.
హీరోలు ఒకరి సినిమాల్ని ఇంకొకరు ప్రోత్సహిస్తోంటే.. ఈ సోషల్ రాజకీయ రచ్చ ఎందుకు.? అన్న దిశగా ఆత్మవిమర్శ చేసుకోవాలి.
మొత్తమ్మీద, సినీ పరిశ్రమ.. తనను నాశనం చేస్తోన్న ఈ దిక్కుమాలిన రాజకీయంపై అప్రమత్తంగా వుండి తీరాల్సిందే.