Table of Contents
Sekhar Kammula Mega Inspiration.. మెగాస్టార్ చిరంజీవి.. కొణిదెల శివ శంకర వరప్రసాద్. ఆయన్ని చూసే కథలు పుడతాయ్.. ఆయన కోసమే, దర్శకులు పాత్రల్ని సృష్టిస్తుంటారు.
తెలుగు సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నిసార్లు చెప్పుకుంటాం ఇదే మాటని.? ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఆ మ్యాజిక్ అలానే వుంటుంది.
మెగాస్టార్ చిరంజీవి అంటేనే అంత. కొత్త తరం దర్శకులు, ఆయనతో సినిమాలు చేయాలని తహతహలాడుతుంటారు. కొత్త తరం నటీనటులు, ఆయనతో కలిసి నటించాలని ఆరాటపడుతుంటారు.
అలాంటి దర్శకుల్లో తానూ ఒకడినని దర్శకుడు శేఖర్ కమ్ముల, తాజాగా వ్యాఖ్యానించారు. దర్శకుడిగా 25 ఏళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల, ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో.
Sekhar Kammula Mega Inspiration.. శేఖర్ కమ్ముల సోషల్ మీడియా పోస్ట్ సారాంశం ఇదీ..
టీనేజ్‌లో ఒకసారి చూశాను చిరంజీవిగారిని.. దగ్గరగా చూశాను. ఈయనతో సినిమా తీయాలి అనే ఫీలింగ్. అంతే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు.
లెట్స్ సెలబ్రేట్.. అని మా టీమ్ అంటే, నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని జనరేషన్స్‌ని ఇన్‌స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన.

ఛేజ్ యువర్ డ్రీమ్స్.. సక్సెస్ మనల్ని ఫాలో అయి తీరుతుంది.. అనే నమ్మకాన్ని ఇచ్చింది చిరంజీవిగారే.
సో, నా 25 ఏళ్ళ జర్నీ సెలబ్రేషన్ అంటే, ఆయన ప్రెజెన్స్‌లోనే చేసుకోవాలనిపించింది. థాంక్యూ సర్. ఈ మూమెంట్స్‌లోనే కాదు, నా టీనేజ్ నుంచీ, మీరు నా ముందు ఇలాగే వున్నారు.
మెగా వయస్సునామీ..
నిజమే, మెగాస్టార్ చిరంజీవి.. అప్పటికీ, ఇప్పటికీ అలానే వున్నారు. వయసు శరీరానికే తప్ప, మనసుకి కాదు.. అని అంటుంటారు.
వెండితెరపై చిరంజీవి డాన్సులు చూస్తే, చిరంజీవి శరీరానికి కూడా వయసు పెరుగుతున్నట్లు అనిపించదు. అప్పుడూ, ఇప్పుడూ అదే ఎనర్జీ చిరంజీవిలో కనిపిస్తుంటుంది.
ఇక్కడ, ఇదంతా ఇలా రాస్తున్న నేను కూడా, మెగాస్టార్ చిరంజీవిని నా చిన్నప్పటి నుంచీ చూస్తూనే వున్నాను. మెగాస్టార్ చిరంజీవి మీద ఎన్నో రాతలు రాశాను.
యముడికి మొగుడు నుంచి వాల్తేరు వీరయ్యదాకా..
అప్పుడెప్పుడో, ‘యముడికి మొగుడు’ సినిమా టైమ్‌లో స్క్రీన్ మీద నేను చూసిన చిరంజీవికీ, ఇప్పుడు తెరపై ‘వాల్తేరు వీరయ్య’గా నేను చూసిన చిరంజీవికీ పెద్దగా తేడా ఏమీ లేదు.
Also Read: గ్లామర్.. యాక్షన్.. అంతా అదే: ‘ఏఐ’ సినిమా చూసొద్దాం రండి.!
చిరంజీవికి, తన అభిమానుల్ని చూస్తే ఊపొస్తుంది. అభిమానుల అంచనాల్ని అందుకోవడమే, తన జీవిత లక్ష్యమని అనుకుంటుంటారాయన.
అభిమానుల ఉత్సాహమే, మెగాస్టార్ చిరంజీవికి ఎనర్జీ. ఈ విషయాన్ని ఆయన చాలా వేదికలపై స్వయంగా వెల్లడించారు.
దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.
– yeSBee