Senior Actor Sudhakar.. ఏ వార్తా లేదా.? ఏదో ఒక సంచలనం వుడాలి కదా.? ఎవరో ఒకర్ని చంపేద్దాం అయితే.! ఎవర్ని చంపేద్దాం.?
ఇలా సాగుతున్నట్టుంది మీడియా సంస్థల్లో ‘బ్రేకింగ్ న్యూస్’ కోసం డిస్కషన్.! ఏ నటుడైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడా.? ఏ రాజకీయ నాయకుడైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడా.?
పగిలిపోయే వార్తల కోసం మీడియా ప్రదర్శిస్తున్న కక్కుర్తికి జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి.!
Senior Actor Sudhakar.. నిజం.. ఇది పైశాచికానందం.!
సినీ నటుడు సుధాకర్ కన్నుమూత.. అంటూ ‘పగిలిపోయే వార్తలు’ దర్శనమిచ్చాయ్.! తెలుగు సినీ పరిశ్రమలో సుధాకర్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
ఎవరో చచ్చిపోతే తమకు ఆనందం అనుకునేటోళ్ళు మీడియాలో ఎక్కువైపోతున్నారు.!
ఈ శవపాత్రికేయం అత్యంత హేయం, జుగుప్సాకరం.!
సొంత మనుషుల్నో.. పనిచేస్తున్న మీడియా సంస్థ యజమానుల్లో ఇలా వార్తల కోసం చచ్చిపోయినట్లు చూపించగలరా.?
ఏమో, ముందు ముందు తెగులు మీడియాలో.. అదేనండీ తెలుగు మీడియాలో ఆ శవ పాత్రికేయం కూడా చూస్తామేమో.?
Mudra369
హీరోగా ట్రై చేసి, విలన్‌గా, కామెడీ విలన్‌గా.. ఇలా చాలా పాత్రల్లో కనిపించారు సీనియర్ నటుడు సుధాకర్. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నారాయన.

ఇంతలోనే, ఆయన చనిపోయారన్న వార్త మీడియాలో కనిపించింది. ఛీ.. ఇదేం మీడియా.? అని చాలామంది చీదరించుకున్నారు.
బతికే వున్నానంటూ వీడియో రిలీజ్ చేసిన నటుడు..
తాను బతికే వున్నాననీ, హ్యాపీగా వున్నాననీ.. తాను చనిపోయానంటూ జరుగుతున్నది కేవలం ఫేక్ ప్రచారం అనీ సుధాకర్ కొట్టి పారేశారు.
ఈ మేరకు సుధాకర్ ఓ వీడియో విడుదల చేశారు. కొన్నాళ్ళ క్రితం సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు విషయంలోనూ ఇలాగే జరిగింది.
Also Read: ఇన్‌సైడ్ స్టోరీ.! మహేష్ ఎందుకు టార్గెట్ అయ్యాడు.?
బ్రహ్మానందం, చంద్రమోహన్.. చెప్పుకుంటూ పోతే, ఈ ‘ఫేక్ డెత్’ వార్తా బాధితులు చాలామందే వున్నారు సినీ రంగంలో.!
ఇప్పుడు మనం చూస్తున్నది మీడియా కాదు.. ఆ ముసుగులో నడుస్తోంది ఓ మాఫియా.!