Table of Contents
Sheep Circle చీమ చిటుక్కుమంటే అది వైరల్.! పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోవడమంటే ఇదే మరి.! అందుకే, ఈ భూమ్మీద సిత్రాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయ్.!
అలాంటి తాజా వైరల్ విషయానికొస్తే, చైనాలోనట.. కొన్ని గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్నాయట.! సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు.. ఆ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్నమాట.!
అరరె, సూర్యుడి చుట్టూ భూమి గుండ్రంగా తిరగడంలేదు.. ఆ కక్ష్య అనేది గుండ్రంగా కాదు, వేరే రకంగా వుంటుందని మేధావితనం చూపేరు.! ఏదో ఓ పోలిక అంతే ఇక్కడ.!
గొర్రెలెందుకు గుండ్రంగా తిరుగుతున్నాయ్.?
ఓ ఫామ్‌లో జరిగిందీ ఘటన. పదుల సంఖ్యలో గొర్రెలు, వృత్తాకారంలో తిరుగుతూ వున్నాయి.
ఒకదాని వెంట ఒకటి.. అస్సలేమాత్రం, నిర్దేశిత వృత్థం దాటకుండా (అప్పుడప్పుడూ లోపలికీ బయటకూ వెళుతున్నాయ్ గానీ..) ఆ గొర్రెలు. పన్నెండు రోజులకు పైగా ఇదే తంతు నడుస్తోందిట.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా పశువుల వైద్య నిపుణులు, జ్యోతిషం చెప్పేటోళ్ళు.. పరిశోధనలు చేసేస్తున్నారు.
Sheep Circle మెదడు మతి తప్పితే..
సాధారణంగా జంతువుల్లో రకరకాల అనారోగ్య సమస్యలొస్తుంటాయ్. అలాంటప్పుడు, ఇలాంటి వింత చేష్టలూ కనిపించొచ్చు. కానీ, ఆ గొర్రెలన్నీ ఆరోగ్యంగానే వున్నాయట.

మరి, ఎందుకిలా ఆ గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్నట్లు.? దీనికీ ఓ పాత సిద్ధాంతాన్ని తెరపైకి సమాధానంగా తెస్తున్నారు.
అదేంటంటే, గొర్రెల మంద.. ఆ మందలో కొన్ని గొర్రెల్ని (నాయకుల్ని) అనుసరిస్తుంటాయ్. ప్రమాదకరమైన ప్రాంతాల నుంచి ఆ ‘లీడర్’ గొర్రెలు దూకేస్తే, అది ప్రమాదమని తెలుసుకోలేక.. మిగతావీ దూకేసి, ప్రాణాలు కోల్పోతుంటాయ్.
సో, ఇది కూడా ఓ కారణం అయి వుండొచ్చు.
ఇదేమన్నా అంతర్జాతీయ సమస్యా.?
అయినా, ఇదేమైనా అంతర్జాతీయ సమస్యా.? ఎందుకింతలా ఈ వీడియో ఇంత వైరల్ అయినట్లు.? ఇన్ని విశ్లేషణలు ఎందుకు జరుగుతున్నట్టు.?
Also Read: ఉద్యోగాలు పోతున్నయ్.! ‘సాఫ్ట్’గా పీకి పారేస్తున్నారంతే.!
రాజకీయ నాయకుల చుట్టూ జనం తిరగట్లేదా.? ఆ రాజకీయ నాయకులు తమ బతుకుల్ని బుగ్గి చేస్తున్నారని తెలిసీ, వాళ్ళకు జై కొట్టడంలేదా.?
అలా పిచ్చిగా, మూర్ఖంగా రాజకీయ నాయకుల ట్రాప్‌లో పడుతున్న మనం కూడా, ‘గొర్రెల భ్రమణం’పై విశ్లేషణలు చేస్తున్నాం.!