ఎవరీ షిర్లే సేటియా.? అంటూ, ‘కృష్ణ వింద విహారి’ సినిమాలో నాగ శౌర్య సరసన హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ (Shirley Setia) గురించి తెగ సెర్చ్ చేసేస్తున్నారు నెటిజనం.!
హిందీలో ‘నికమ్మ’ సినిమాలో కనిపించిందీ షిర్లే సేటియా. తెలుగులో నాని, సాయి పల్లవి, భూమిక ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాకి ఇది హిందీ రీమేక్.
ఆ ‘నికమ్మ’లో నటించిన షిర్లే సేటియా, క్యూట్ అండ్ హాట్ లుక్స్‌తో మన టాలీవుడ్ దర్శక నిర్మాతల్నీ ఆకట్టుకున్నట్టుంది.
Shirley Setia.. ఆ విషయం వుందండోయ్..
సాధారణంగా అందాల భామలు డబ్బింగ్ చెప్పుకోవడానికే ఇష్టపడరు. కానీ, కొందరు డబ్బింగ్ చెప్పేసుకోవడమే కాదు, పాటలు కూడా పాడేస్తుంటారు.

షిర్లే సేటియా మంచి సింగర్. నిజానికి, తొలుత ఆమెకు సింగర్‌గానే గుర్తింపు లభించింది. ఆ తర్వాతే ఆమె నటిగా మారింది. అద్గదీ అసలు సంగతి.
‘నికమ్మ’ సినిమాలోనూ ఓ పాట పాడేసింది షిర్లే సేటియా. తెలుగులోనూ ముందు ముందు ఈ బ్యూటీ పాటలు పాడేయొచ్చేమో.!
Also Read: డబుల్ ట్రబుల్.! కూతురికి ‘డేటింగ్’పై తల్లి ఉచిత సలహా.!
అన్నట్టు టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కొత్త కొత్త భామలకు అవకాశాలు పోటెత్తుతున్నాయ్. మరి, షిర్లే సేటియా.. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా.?
ఏమో, లక్కు కలిసొస్తే.. స్టార్ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇదిలా వుంటే, షిర్లే సేటియా పుట్టింది ఇండియాలోని డామన్‌లో అయినా, పెరిగింది మాత్రం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో. అక్కడే పెరిగి పెద్దదయ్యింది.
పైజమా పాప్ స్టార్ షిర్లే సేటియా..
చిన్నప్పటినుంచే సంగీతం పట్ల ఆసక్తితో పాప్ సింగర్‌గా మారింది. యూ ట్యూబ్ ద్వారా బోల్డన్ని వీడియోలతో లక్షలాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది షిర్లే సేటియా.
‘పైజామా పాప్ స్టార్’గా ఆమెకు న్యూజిలాండ్‌లో గుర్తింపు లభించడం గమనార్హం.
ఆండ్రియా జెర్మయా, మమతా మోహన్ దాస్.. వీళ్ళంతా తొలుత సింగర్స్.. ఆ తర్వాతే నటీమణులుగా గుర్తింపు పొందారు.