Table of Contents
Shubman Gill Double Century.. వన్డే క్రికెట్‌లో సెంచరీ కొట్టడమే కనాకష్టమైన వ్యవహారం ఒకప్పుడు. కానీ, డబుల్ సెంచరీ అనేది సర్వసాధారణమైపోయింది.
అందునా, టీమిండియాకి ఈ మధ్య తరచూ డబుల్ సెంచరీలు వచ్చి పడుతున్నాయ్. కుర్రాళ్ళు అలా వున్నారు మరి.!
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేందర్ సెహ్వాగ్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. డబుల్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.
Shubman Gill Double Century.. మొన్న ఇషాన్.. ఇప్పుడు శుభ్‌మన్..
మొన్నీమధ్యనే యంగ్‌స్టర్ ఇషాన్ కిషన్ కూడా డబుల్ సెంచరీ బాదేశాడు.! ఆ అద్భుతం చూసి ఎన్నో రోజులు అవలేదు.. ఇంతలోనే, ఇంకో డబుల్ అద్భుతం.
చూస్తోంటే, కుర్రాళ్ళు ముందు ముందు ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టేలా వున్నారు వన్డేల్లో. అది కూడా మన టీమిండియా ఆటగాళ్ళ వల్లే సాధ్యమవుతుందేమో.!
Mudra369
ఈసారి వంతు శుభ్‌మన్ గిల్.! ఔను, ఈ యంగ్‌స్టర్ హైద్రాబాద్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.
శుభ్‌మన్ గిల్ ఎవరి శిష్యుడో తెలుసా.? యువీ శిష్యుడు.! ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్ శిష్యుడు కదా.. ఆ మాత్రం పవర్ వుంటుంది మరి.!
యువీరత్వం గుర్తొచ్చిందేమో..
తన మెంటార్ అయిన యువరాజ్ సింగ్‌ని గుర్తు చేసుకున్నాడేమో.. మైదానంలో చెలరేగిపోయాడు.. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
208 పరుగులు చేసి ఔట్ అయ్యాడు శుభ్‌మన్ గిల్. టీమిండియాలో మిగతా ఆటగాళ్ళెవరూ కనీసం అర్థ సెంచరీ కూడా సాధించలేదు ఈ మ్యాచ్‌లో.

ఓ వైపు వికెట్లు టపటపా పడుతున్నా.. శుభ్‌మన్ గిల్ మాత్రం అత్యంత బాధ్యతగా ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా చితక్కొట్టాడు.
ట్రిపుల్ సెంచరీ ఎప్పుడు.?
వాట్ నెక్స్‌ట్.? డబుల్ సెంచరీ కొట్టి, ట్రిపుల్ సెంచరీ కొట్టలేకపోవడంపై ఇషాన్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు మొన్న.
Also Read: Waltair Veerayya.. ఓర్నీ.! నువ్వు కూడానా.?
చూస్తోంటే, కుర్రాళ్ళు ముందు ముందు ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టేలా వున్నారు వన్డేల్లో. అది కూడా మన టీమిండియా ఆటగాళ్ళ వల్లే సాధ్యమవుతుందేమో.!