Shubman Gill Sara Alikhan.. మైదానంలో సిక్సర్ల మోత మోగించేస్తాడు.! అంతేనా, మైదానం వెలుపల, అందాల భామల్ని ‘గిల్లు’తుంటాడు కూడానట.!
ఎవరా క్రికెటర్.? ఏమా కథ.? ఇంతకీ ఎవరా హీరోయిన్.! ఈ క్రికెట్ గ్లామర్ ‘గిల్లు’డులో నిజమెంత.? తెలుసుకుందాం పదండిక.!
ఆమె బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ (Sara Ali Khan). అతడేమో క్రికెటర్ శుభ్‌మన్ గిల్.! ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయ్.!
Shubman Gill Sara Alikhan.. క్రికెటర్‌ని పెళ్ళాడతానుగానీ..
తన ఆలోచనలకు తగ్గ మగాడు దొరికితే, అతనితో ప్రేమలో పడతాననీ, పెళ్ళి పీటలెక్కుతానని చెబుతోంది బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్.

‘అతడు క్రికెటర్ కావొచ్చు, సినిమా హీరో కావొచ్చు, వ్యాపార వేత్త కావొచ్చు.. సామాన్యుడైనా కావొచ్చు..’ అని సారా అలీ ఖాన్ (Sara Ali Khan) చెప్పడం కొసమెరుపు.
ప్రస్తుతానికైతే తన మనసుకు నచ్చినోడు దొరకలేదనీ, ఆ కోణంలో తాను ఇంకా ఎవర్నీ చూడలేదనీ సారా అలీ ఖాన్ (Sara Ali Khan) చెబుతోంది.
శుభ్‌మన్ గిల్ ఏమంటాడో.!
అయితే, ఈ మొత్తం వ్యవహారంపై శుభ్‌మన్ గిల్ ఇంతవరకు స్పందించలేదు. క్రికెటర్లకూ, అందాల భామలకూ మధ్య ప్రేమాయణం ఇదే కొత్త కాదు.!
Also Read: Kalyani Priyadarshan.. సొగసుల ఖిల్లా.. ఈ నల్లా నల్లాని పిల్ల.!
విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ.. సహా ఎన్నో క్రికెట్ – సినీ జంటలున్నాయ్.! ఏమో, శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా సినిమా హీరోయిన్‌నే పెళ్ళాడతాడేమో కూడా.!