బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha To Make Tollywood Debut) కొన్నాళ్ళ క్రితం తనకు తెలుగు సినిమాల్లో నటించాలని వుందంటూ ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా వ్యాఖ్యానించింది..
అదీ తెలుగు నేలపైన కావడమే ఆసక్తికరమైన అంశం. సినిమా ప్రమోషన్ల కోసం హీరోయిన్లు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయడం మామూలే.
అయితే, సోనాక్షి సిన్హా.. అందరిలా కాదు. ఆమె కాస్తంత స్పెషల్. బాలీవుడ్ ‘షాట్-గన్’ శతృఘన్ సిన్హా కుమార్తె ఆమె.
దక్షిణాది సినిమాల్లో నటిస్తానని చెప్పింది, రజనీకాంత్ హీరోగా నటించిన ‘లింగా’ సినిమాతో తమిళ ప్రేక్షకుల్నీ, పనిలో పనిగా తెలుగు ప్రేక్షకుల్నీ పలకించింది.
అయితే, డైరెక్టుగా తెలుగు సినిమా ఎప్పుడు.? అన్న ప్రశ్నకు సోనాక్షి ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు.
తాజాగా సోనాక్షి (Sonakshi Sinha Spicy) సినిమా ఓ తెలుగు సినిమాకి ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. అది కూడా ఓ సీనియర్ హీరో సరసన అట.
ఔనా.? నిజమా.? ఇంతకీ ఎవరంట.!
ఆ సీనియర్ హీరో ఎవరు.? అంటే, మళ్ళీ రకరకాల ఊహాగానాలు. వాటిల్లో ఒక గాసిప్ ప్రకారం అయితే, నాగార్జున నటించబోయే ‘బంగార్రాజు’ సినిమా అంటున్నారు.
మరోపక్క, ఓ యంగ్ హీరో సరసన నటించేందుకు కూడా సోనాక్షి సిన్హా (Sonakshi Sinha Hot) సిద్ధంగా వుందని సమాచారం. ఆ వివరాలు త్వరలోనే తెలియనున్నాయట.
‘బంగార్రాజు’ సినిమా కోసమే సోనాక్షి కసరత్తులు గట్టిగా చేసి, కాస్త బరువు కూడా తగ్గిందట. అంటే, బొద్దుగుమ్మ కాస్తా.. స్లిమ్ అండ్ హాట్.. అన్నట్టు తయారైందని అనుకోవాలేమో.
ఇంతకీ సోనాక్షి (Sonakshi Sinha Tollywood), టాలీవుడ్ ఎంట్రీ (Sonakshi Sinha To Make Tollywood Debut) నిజమేనా.? ఏమో, కొన్నాళ్ళాగితే స్పష్టత వచ్చేస్తుంది కదా.. అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు మరి.