చాలా కామెడీ సినిమాల్లో చూస్తుంటాం.. బ్రేక్ ఫాస్ట్ ఫలానా దేశంలో, లంచ్ మరో దేశంలో.. డిన్నర్ ఇంకో దేశంలో చేశానంటూ నటీనటులు చెప్పడం. కామెడీ కాదది.. నిజంగానే జరుగుతోందిప్పుడది. ప్రపంచం చాలా చాలా చిన్నదైపోయింది. ఏ మూల నుంచి ఏ మూలకైనా.. వేగంగా వెళ్ళిపోగలుగుతున్నాం. ఎయిర్ కనెక్టివిటీ (Space Tourism No More A Dream) అలా పెరిగిపోయింది మరి.
దేశాల మధ్య చక్కర్లు కొడితే మజా ఏముంది.? ఇకపై గ్రహాల మధ్య చక్కర్లు కొట్టేస్తామేమో. మొన్న వర్జిన్ గెలాక్టిక్.. ఇప్పుడేమో బ్లూ ఆరిజిన్.. స్పేస్ టూరిజం దిశగా అత్యంత వేగంగా అడుగులేస్తున్నాయి ఈ సంస్థలు.
Also Read: అందాల మంట పెట్టేస్తున్నారహో
వర్జిన్ గెలాక్టిక్.. ఓ పెద్ద విమానం ద్వారా మనుషుల్ని అంతరిక్ష యాత్రీకుల్లా మార్చేసి.. అలా అంతరిక్షంలోకి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తుంది. ఇందుకోసం పెద్ద విమానానికి అమర్చిన ఓ చిన్న స్పేస్ క్రాఫ్ట్ ఉపయోగపడుతుంది. క్షేమంగా వెళ్ళి.. చాలా ఆనందంగా వెళ్ళొచ్చేశారు ఆరుగురు ఆ ప్రయోగం ద్వారా ఇటీవలే.
చిత్రమేంటంటే వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర జరిగిన కొద్ది రోజుల్లోనే మరో అంతరిక్ష యాత్ర జరిగింది. ఈసారి బ్లూ ఆరిజిన్ ఆ ఘనతను సొంతం చేసుకుంది. రాకెట్ ద్వారా స్పేస్ మాడ్యూల్‌ని అంతరిక్షంలోకి పంపడం బ్లూ ఆరిజన్ ప్రత్యేకత. నలుగురు వ్యక్తులు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. అదీ చాలా తక్కువ వ్యవధిలో.
Also Read: స్కూళ్ళలో శృంగార విద్యాభ్యాసం.?
టీవీల్లో లైవ్ ప్రోగ్రామ్ నడుస్తుండగానే.. అదీ చాలా తక్కువ సమయంలోనే.. గంట, గంటన్నర సమయంలోనే సరదాగా, అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చేశారన్నమాట. ఇప్పటిదాకా కేవలం అంతరిక్ష ప్రయోగాల నిమిత్తమే వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళి వస్తున్నారు. ఇకపై సీన్ మారిపోనుంది.
ఇక, స్పేస్‌లోకి సరదాగా వెళ్ళి రావడానికి ఖర్చు చాలానే అవుతోంది. అమెజాన్ అధినేత బెజోస్ లాంటివాళ్ళకైతే అది పెద్ద కష్టం కాదు. కానీ, సామాన్యుల మాటేమిటి.? ఏమో, ఆ ముచ్చటా త్వరలో తీర్చేసేలా ఖర్చు తగ్గిపోతుందేమో.!
Also Read: అర్జంటుగా విరాట్ కోహ్లీని పీకెయ్యాల్సిందే.!
వెళ్ళి రావడం మాత్రమే కాదు.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లుగా.. అంతరిక్షంలోనే.. ఓ పెద్ద ప్రపంచాన్ని (Space Tourism No More A Dream) మనం ఏర్పాటు చేసేసుకుంటామేమో.!