Sudheerbabu Cinematic Blood.. సినిమా థియేటర్లకి ప్రేక్షకులు ఎందుకు రావడంలేదు.? గత కొన్నాళ్ళుగా సినీ పరిశ్రమని వేధిస్తున్న ప్రశ్న.
సినిమాల్లో అశ్లీలం, హింస.. ఎక్కువైపోతోంటే, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా సినిమాలకి వస్తారు.? కుటుంబంతో సహా సినిమా చూడాలనుకున్న ఓ మధ్య తరగతి వ్యక్తి నుంచి వచ్చిన సమాధానమిది.
ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే సినిమాలు తీస్తే, టీవీ సీరియళ్ళే బెటరనుకుని, థియేటర్లకు రావడంలేదు కదా.! ఓ సినీ ప్రముఖుడి నుంచి దూసుకొచ్చిన ప్రశ్న ఇది.
పోనీ, హింస – రక్తపాతం.. వీటి వల్ల థియేటర్లకు ఆడియన్స్ పెరుగుతున్నారా.? అంటే, అదీ లేదు.! ‘ఈ సినిమా వరకూ నన్ను వదిలెయ్యండి’ అనేశాడు ఈ మధ్యన ఓ ఫ్యామిలీ హీరో.
Sudheerbabu Cinematic Blood.. నరుక్కుంటూ పోయాడు..
సదరు ఫ్యామిలీ హీరో నుంచి వచ్చిన ‘రక్తపాతం సినిమా’ అలాంటిది మరి.! నరుక్కుంటూ పోయాడు.. సినిమా ‘హిట్టు’ అనిపించేసుకున్నాడు.!
తాజాగా, హీరో సుధీర్‌బాబు నుంచి ఓ ‘పోస్టర్’ వచ్చింది. హీరో, షర్ట్ లేకుండా కండలు తిరిగిన శరీరాన్ని ప్రదర్శిస్తున్నాడు.. అదీ, బ్యాక్ నుంచే చూపించార్లెండి.
అక్కడన్నీ శవాలే కనిపిస్తున్నాయి.! శవాలు అలా పరిచేసి వుండగా, మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు హీరో, చేతిలో ఆయుధంతో.!
సో, సినిమాలో విషయమేంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.! సినిమా నిండా హింస, రక్తపాతమే వుండబోతున్నాయన్నమాట.
రక్తం టన్నుల్లో, టీఎంసీల్లో..
ఈ మధ్య కొత్త సినిమా ఏదన్నా వస్తోందంటే, ‘ఎన్ని టీఎంసీల రక్తం (రక్తమంటే, రక్తం లాంటి రంగు అని అర్థం) వాడుతున్నారేంటీ.? అనే సెటైరికల్ ప్రశ్న వస్తోంది సినీ వర్గాల్లో.
ఓ వైపు, సమాజంలో నేరాలు, ఘోరాలు.. అత్యంత దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇంకోపక్క, సినిమాల్లోని హింస, రక్తపాతం.. కొత్త పుంతలు తొక్కుతోంది.
Also Read: కుక్కల్లా మొరిగితే.. లోపలేస్తాం: పవన్ కళ్యాణ్ హెచ్చరిక
సినీ జనాలకి సామాజిక బాధ్యత లేదా.? అంటే, ‘నచ్చకపోతే ఎవడు చూడమన్నాడు.?’ అన్న ప్రశ్న అట్నుంచి వచ్చేస్తుంటుంది.
అన్నట్టు, సుధీర్‌బాబుకి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఒకింత పాజిటివ్ ఇమేజ్ వుండేది.. కానీ, అది ఒకప్పుడు.! ఈ సినిమాతో పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఆయన దూరమైపోతాడేమో.!
కామెడీ ఏంటంటే, సుధీర్‌బాబు పుట్టినరోజు సందర్భంగా, ఈ శవాల పోస్టర్ విడుదల చేయడం.