Super Star Maheshbabu OTT.. కరోనా దెబ్బకి సినిమా భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. సినీ పరిశ్రమ తిరిగి యథాతథ స్థితికి.. అంటే, కరోనా పాండమిక్ ముందున్న పరిస్థితులకి ఎప్పుడు చేరుకుంటుందో అంచనా వేయడం కష్టం. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని పే పర్ వ్యూ విధానంలో విడుదల చేసుకోమని చాన్నాళ్ల క్రితం ఓ సినీ ప్రముఖుడు, జక్కన్న రాజమౌళికే సలహా ఇచ్చాడు. రాజమౌళి ఆ సలహాని పట్టించుకోలేదు.
ఇంతకీ, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh) ఓటీటీపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాడు.? ఈ ప్రశ్నకు మహేష్ సమాధానమిస్తూ, ఓటీటీని తాను గౌరవిస్తానని చెప్పాడు. అయితే, తన సినిమాలు మాత్రం ధియేటర్లలోనే విడుదలవుతాయని స్పష్టం చేశాడు. ధియేటర్లలో ప్రేక్షకుల్ని కలవడమే తనకిష్టమని అన్నాడు.
Also Read: వెండితెరకు ‘ఓటీటీ’ వణుకు.. తప్పదు, సర్దుకుపోవాల్సిందే.!
అభిమానుల కేరింతలు తనకు కొత్త ఉత్సాహాన్నిస్తాయంటున్న మహేష్ కరోనా పరిస్థితులు ఎక్కువ కాలం ఉండబోవని ఆశా భావం వ్యక్తం చేశాడు. నిజమే, పెద్ద హీరోల సినిమాలు ధియేటర్లలోనే చూడాలి. ‘నారప్ప’ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమాని ధియేటర్లలో చూస్తే తొలిరోజు, తొలి వారం అభిమానుల హంగామా ఏ స్థాయిలో ఉండేదో.
కానీ, సినిమా కంటే, ప్రాణం చాలా విలువైంది. కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదు. సినిమా ధియేటర్లు తెరవడానికి ప్రభుత్వాలు అనుమతించినా, ప్రజల్లో భయం పోలేదు. ధియేటర్లే చాలా సేఫ్ అని హీరో నాని ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు. నాని (Natural Star Nani) ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. ‘వి’ (V Movie)సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు మరి.
Also Read: క్షీరాభిషేకం.. అభిమానమా.? పైత్యమా.? భక్తి అనగలమా.?
మహేష్ (Maheshbabu) కావచ్చు.. మరో హీరో కావచ్చు.. భవిష్యత్ ఆశా జనకంగా ఉండాలనే కోరుకుంటున్నారు. కోరుకోవాలి కూడా. అదే సమయంలో బ్లాక్ టికెట్ల దందా నుంచి ప్రేక్షకులకు ఉపశమనాన్నిచ్చింది ఓటీటీ. ఓటీటీతో ప్రయోజనాలున్నాయి. సినిమా ధియేటర్ అనుభవాన్ని మిస్ అవుతున్న బాధ ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ, తప్పదు.