Table of Contents
Sweet Potato Health Benefits.. వర్షా కాలం వచ్చిందంటే చాలు.. ఈగలు, దోమలు.. వాటితో పాటూ చిరు చిరు అనారోగ్య పరిస్థితులు వేధిస్తుంటాయ్.
చినుకుల్లో తడవడం తద్వారా జలుబు, దగ్గుల బారిన పడడం తరచూ జరుగుతుంటుంది. ఈ వాతావరణం.. ఆరోగ్యానికి కాస్త చికాకు పుట్టిస్తుంటుంది.
ఇలాంటి వాతావణంలో వచ్చే అనారోగ్య పరిస్థితుల్ని తట్టుకుని శరీరం శక్తివంతంగా, ఉత్సాహంగా వుండడానికి కొన్ని చిట్కాలతో పాటూ సీజనల్‌గా లభించే ఆహార పదార్ధాలను మన డైట్‌లో చేర్చుకోవాలి.
అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది చిలగడ దుంప. చిలగడ దుంప ఆరోగ్యానికి చాలా మంచిది.
చిలగడ దుంపతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఖచ్చితంగా దీన్ని ఇష్టపడని వారుండరు.
Sweet Potato Health Benefits.. అవేంటో తెలుసుకుందామా.!
చిలగడ దుంపలో ఫైబర్ కంటెంట్ చాలా చాలా ఎక్కువ. అంతేకాదు, అనేక రకాల విటమిన్లు కూడా వుంటాయ్. ముఖ్యంగా చిలగడ దుంపలోని ఫైబర్ కంటెంట్ వర్షాకాలంలో శరీరానికి చాలా ఉపయోగపడుతుంది.

దీనిలోని ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణ సమస్యలు తొలగిపోతాయ్. చాలా సులువుగా జీర్ణమవ్వడంతో గ్యాస్, ఉబ్బరం తదితర జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు. జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది.
చిలగడ దుంపలోని పొటాషియం, మెగ్నీషియం రక్త పోటును అదుపులో వుంచేందుకు తోడ్పడతాయ్. తద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా వుండొచ్చు.
కీళ్ల నొప్పులకు దివ్యౌషధం.!
సాధారణంగా ఈ సీజన్‌లో కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయ్ బహుశా చల్లగాలిలో తిరుగడం వల్ల కావచ్చు.. ఇతరత్రా కారణాలు కావచ్చు..
ఈ సీజన్ వయసుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు చాలా ఎక్కువగా వుంటారని వైద్యులు సూచిస్తుంటారు.

సో, అలాంటి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు చిలగడ దుంపను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కనీసం వారానికి ఒకటి లేదా రెండు సార్లయినా చిలగడ దుంపలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
కళ్ల సంబంధిత సమస్యలు రాకుండా.!
కళ్ల సంబంధిత సమస్యలు రాకుండా వుండాలంటే క్యారెట్, ఆకు కూరలు అధికంగా తీసుకోవాలి. అలాగే వాటితో పాటూ, చిలగడ దుంపల్ని కూడా తీసుకుంటే మంచిదని నిపుణుల సలహా.
Also Read: అందం పిచ్చి.. ఆమెను ‘అంతం’ చేసిందా.?
చిలగడ దుంపలో ఫైబర్‌తో పాటూ విటమిన్ ‘ఎ’ అధికంగా వుంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అలాగే, విటమిన్ బి 6 కూడా చిలగడ దుంపల్లో పుష్కలంగా లభిస్తుంది.
దీని వల్ల చర్మం పొడిబారే సమస్య వుండదు. తద్వారా చర్మం తాజాగా వుంటుంది. చిలగడ దుంపల్ని తరచూ తీసుకునే వారిలో ఐరన్ లోపం కనిపించదు.
గమనిక:
ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్నకొంత సమాచారమూ, మరియు కొందరు వైద్య నిపుణుల సలహాల నుంచి సేకరించబడింది. కేవలం అవగాహన కోసం మాత్రమే.
