TDP Janasena Vote Transfer.. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయ్ కాబట్టి, గడచిన నాలుగున్నరేళ్ళలో అత్యద్భుతమైన పాలన అందించేశాం కాబట్టి, 2024 ఎన్నికల్లో అంతకు మించిన సీట్లు వచ్చేస్తాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా వుండగలరా.?
రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్.! ఓటరు నాడిని పట్టుకోవడం ఎవరికీ అంత తేలిక కాదు.! ఐదేళ్ళకోసారి ఓటు అనే ఆయుధం ప్రజల చేతుల్లోకి వస్తుంది.. అదే, రాజకీయ పార్టీల్ని శాసిస్తుంటుంది.
సరే, ఓట్లను కరెన్సీ నోట్లతో కొనెయ్యడమెలాగో రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేర్లతో ఓటర్లను ఆకర్షించడమూ, ఓటర్లను ప్రలోభపెట్టడమూ రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్యే.
ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలదీ ఒకటే పంథా. ఒకరు ఎక్కువ.. ఇంకొకరు ఇంకాస్త ఎక్కువ అంతే.!
TDP Janasena Vote Transfer.. మంచోళ్ళెవరు.? చెడ్డోళ్ళెవరు.?
ఎవరు మంచి.? ఎవరు చెడ్డ.? అన్న విషయాన్ని పక్కన పెడితే, 2024 ఎన్నికలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్ ఎలా వుండబోతోందో ఓ సారి చూద్దాం.!
టీడీపీ – జనసేన జతకట్టాయ్.! ఈ రెండు పార్టీలూ కలవకుండా చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నానా తంటాలూ పడింది. మిత్రపక్షం బీజేపీని సైతం కాదని, టీడీపీతో జతకట్టడానికి జనసేనాని సిద్ధమయ్యారు. అంతలోనే, బీజేపీ ‘ఆశీస్సులు’ కావాలని అంటున్నారు.
ఏమో, బీజేపీ కూడా టీడీపీ – జనసేన కూటమితో కలుస్తుందేమో. కలుస్తుందా.? లేదా.? అన్నది ఇప్పుడే చెప్పలేం. కలిసినా, కలవకున్నా.. టీడీపీ – జనసేన కూటమికి బీజేపీ వల్ల ప్రత్యేకమైన లాభం, నష్టం ఏమీ వుండవ్.
టీడీపీ – జనసేన మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది సజావుగా సాగడమే కీలకం ఇక్కడ. కింది స్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తలూ కదురుకుంటున్నారు. నాయకులూ సర్దుకుపోతున్నారు.
ఎవరి బలమేంటో..
జనసేన పార్టీకి తమ బలమేంటో తెలుసు.! టీడీపీకి, జనసేన అవసరం ఎంతో తెలుసు.! మేటర్ క్లియర్, ఈక్వేషన్ సుస్పష్టం.! జనసేన కోరినన్ని సీట్లు కాకపోయినా, గౌరవ ప్రదంగా జనసేన పార్టీకి టీడీపీ సీట్లు కేటాయించే అవకాశం వుంది.
ఆ గౌరవ ప్రదమైన సీట్ల కేటాయింపు కూడా, ఓటు ట్రాన్స్‌ఫర్ సజావుగా సాగేందుకు దోహదం చేస్తుంది.. ఇరు పార్టీల పరంగా.!
Also Read: కష్టపడమాకు.! ‘జైలర్’ని చూసి నేర్చుకో చిరంజీవీ.!
సజావుగా ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది ఇరు పార్టీల మధ్యా జరిగితే, వైసీపీ మూటా ముళ్ళె సర్దేసుకోవాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
అందుకే, వైసీపీ.. ఈ రెండు పార్టీల పొత్తునీ చెడగొట్టేందుకు మేగ్జిమమ్ ట్రై చేస్తోంది. కానీ, అదంతా వృధా ప్రయాసనగానే మిగిలిపోవచ్చు. అయితే, ముందే చెప్పుకున్నాం కదా.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.