TDP YSRCP Condom Politics.. అసలు వాళ్ళ ఇళ్ళలో మహిళలు ఆయా నాయకుల్ని ఎలా భరిస్తున్నారు.? ఆయా పార్టీల్లో మహిళా నేతలు ఎలా రాజకీయంగా మనుగడ సాధించగలుగుతున్నారు.?
సాధారణ ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అసహ్యించుకుంటున్నారా ఈ రాజకీయాల్ని.? ఎందుకు అసహ్యించుకోరు.? కాకపోతే, ఏమీ చేయలేని దుస్థితి.
పొరుగు రాష్ట్రాల్లో మాత్రం పరువు పోతోంది. పోతే పోనీ.. సిగ్గా.? లజ్జా.? ఔను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బొత్తిగా సిగ్గొదిలేశాయి.
TDP YSRCP Condom Politics.. ఏమిటీ కండోమ్ రాజకీయం..
తెలుగు దేశం పార్టీ కండోమ్ ప్యాకెట్లతో జనంలోకి వెళ్ళిందన్నది వైసీపీ ఆరోపణ. టీడీపీ కండోమ్ రాజకీయాల పట్ల రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
ఇదంతా వైసీపీ మార్కు దిగజారుడు రాజకీయమని టీడీపీ (Telugu Desam Party) ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో వైసీపీ కండోమ్ ప్యాకెట్లను టీడీపీ చూపిస్తోంది.
అసలు కండోమ్ ప్యాకెట్లతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నదే వైసీపీ (YSR Congress Party) అన్నది టీడీపీ ఎదురుదాడి సారాంశం.
ఈ నీఛ నికృష్ట రాజకీయానికి అంతమేంది.?
నో డౌట్.. ఇలాంటివి ఎవరు చేసినా తప్పే.! అయినా, కండోమ్‌లను పంచితే నేరమేంటి.? సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్‌ని అరికట్టాలంటే, కండోమ్ వినియోగంపై అవగాహన పెంచడం అవసరమే.
కానీ, ఇది పద్ధతి కాదు.! కండోమ్ ప్యాకెట్లతో రాజకీయం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.! పైగా, రాజకీయ ప్రత్యర్థుల్ని ట్రోల్ చేయడానికి వీటిని వినియోగించడం ముమ్మాటికీ పైశాచికానందమే.
ఇది సోషల్ మీడియా యుగం. రాజకీయ పార్టీలు చేస్తున్న నీఛ నికృష్ట పనులు, రాజకీయ నాయకులు వాడుతున్న బూతులు.. ఇవన్నీ నేరుగా అందరికీ చేరిపోతున్నాయ్.
దిగజారడంలో ఇంతకన్నా పతనం ఇంకేమీ వుండదనుకుంటున్న ప్రతిసారీ, అంతకు మించి దిగజారిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు.
కండోమ్, వయాగ్రా.. ఆ తర్వాతేంటి.? ఇంట్లోని ఆడవాళ్ళు, చిన్న పిల్లలు.. సదరు రాజకీయ నాయకుల్ని ఇంట్లోంచి తరిమికొట్టాలేమో.!