Team India.. టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది.. అదీ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో. ఇంకేముంది.? దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కలత చెందారు. నిజమే, వన్డే కావొచ్చు.. టీ20 కావొచ్చు.. వరల్డ్ కప్ పోటీల్లో టీమిండియా ఎప్పుడూ పాకిస్తాన్ జట్టు మీద ఓడిపోలేదు. కానీ, ఆ ఘనత ఇప్పుడిక టీమిండియాకి లేదు.
క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు, భారతదేశంలో. అంతకు మించి క్రికెట్‌ని ఇంకో స్థాయిలో చూస్తారు అభిమానులు. సరే, ఆటలో గెలుపోటములు సహజం. టీమిండియా బ్యాడ్ లక్. పైగా, ‘అతి విశ్వాసం’ కూడా టీమిండియా ఓటమికి కారణమై వుండొచ్చు. కానీ, టీమిండియా ఓడిపోవడానికి అసలు కారణమిదేనంటూ.. కొందరు సెలబ్రిటీల్ని బాధ్యుల్ని చేస్తున్నారు వెర్రి అభిమానులు.

Team India.. ఆడిందెవరు.? ఓడించిందెవరు.?
బాలీవుడ్ నటీమణులు ఊర్వశి రౌతెలా, మానుషి చిల్లర్ తదితరులు దుబాయ్‌లో టీమిండియా – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌ని తిలకించారు. అక్కడ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఆయా సెలబ్రిటీలు సెల్ఫీ ఫొటోల్నీ, వీడియోల్నీ పోస్ట్ చేశారు. మన టాలీవుడ్ నుంచి నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ కూడా ఈ స్టేడియంలో వున్నారు.
Also Read: చిరంజీవిని ఓడించేశారట్రోయ్.! ఈ శునకానందమేట్రోయ్.?
ఇంకేముంది.? వీళ్ళ వల్లే టీమిండియా ఓడిపోయిందంటూ సోషల్ మీడియాలో ‘సొల్లు కబుర్లు’ షురూ అయ్యాయి. చిత్రమేంటంటే, ఆయా సెలబ్రిటీలంటే మామూలుగానే అస్సలు గిట్టని మీడియా, వీటిని తాటికాయంత అంశాలుగా మార్చేస్తూ హైలైట్ చేస్తుండడం.
క్రికెట్ (Team India) అనే కాదు, అన్నిచోట్లా సెంటిమెంట్లుంటాయి. కానీ, ఇలాంటివాటికి సెంటిమెంట్లు ఆపాదిస్తే ఎలా.? కొన్నాళ్ళ క్రితం క్రికెటర్ల భార్యల మీద పడి ఏడ్చారు. ఇప్పుడు ఇదిగో, ఇలా సెలబ్రిటీల మీద పడి ఏడుస్తున్నారు. దీన్నొక మానసిక రోగం.. అనుకోవాలేమో.