Table of Contents
Telugu Media Ganja Journalism.. జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ద్వేషమా.? లేదంటే, సనాతన ధర్మమంటే గిట్టదా.?
సోకాల్డ్ ‘ఎర్నలిస్టులు’ కొందరు, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న సనాతన ధర్మంపై ఎందుకు అభ్యంతరకరమైన రీతిలో దుష్ప్రచారానికి తెరలేపుతున్నారు.?
ఈ భూమ్మీద ఎవరు ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు.. అది వారిష్టం.! ఆయా వ్యక్తుల ‘మత స్వేచ్ఛ’ విషయమై ఇంకొకరి పెత్తనం అత్యంత దారుణం.
Telugu Media Ganja Journalism.. సనాతన ధర్మంపై కత్తి దూస్తున్న ఎర్నలిస్టులు..
అందునా, సనాతన ధర్మ పునాదులపై భారతావని చరిత్ర లిఖించడబడిన దరిమిలా, భారత దేశంలో సనాతన ధర్మం ఆచరించడాన్ని తప్పు పట్టడమంటే అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?
నిజానికి, సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ ‘సర్వే జనా సుఖినోభవంతు’ అనే కదా చెప్పేది.?
పరమత సహనం అనేది హిందూ ధర్మంలోనే వుంది కదా.! అలాంటప్పుడు, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే, సోకాల్డ్ ఎర్నలిస్టులకు వచ్చిన కష్టమేంటి.?
ఆయా ఎర్నలిస్టులు ఇతర మతాల్ని అనుసరిస్తుండొచ్చుగాక.! అంత మాత్రాన, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న సనాతన ధర్మంపై వీళ్ళకెందుకు అంత కడుపు మంట.?
కలం నిండా విషమే..
నిజానికి, క్రిస్టియానిటీ అయినా.. ఇస్లాం అయినా.. ఆయా మతాల్ని అనుసరించేవారు సైతం, హిందూ ధర్మంపైనా సనాతన ధర్మంపైనా విషం చిమ్మే పరిస్థితులు వుండవేమో.!
కాకపోతే, హిందూ ధర్మంపై నమ్మకం లేక, ఏదో ఆశించి ఇతర మతాలవైపు వెళ్ళి, హిందూ ధర్మాన్ని ద్వేషించే కొందరితోనే వస్తోంది సమస్య అంతా.! వీళ్ళ వల్లనే మత విద్వేషాలు చెలరేగుతుంటాయి.
Also Read: ప్రకాష్ రాజ్.! అసలు నువ్వు ఎవడివి.?
దురదృష్టమేంటంటే, పాత్రికేయ వనంలో ఈ మధ్య ఈ తరహా గంజాయి మొక్కలు ఎక్కువైపోయాయ్.!
ఆయా రాజకీయ పార్టీల ప్రాపకం కోసం ఏ ‘పెంట’ తినడానికైనా సిద్ధపడే సదరు ఎర్నలిస్టులు, పవన్ కళ్యాణ్ మీద పనికట్టుకుని సనాతన ధర్మం విషయమై విషం చిమ్మడంలో వింతేముంది.?
గంజాయి మొక్కలు
ఒక్కటి మాత్రం నిజం.. సనాతన ధర్మంపై దాడులు.. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కుట్రలు.. వందల ఏళ్ళుగా జరుగుతూనే వున్నాయ్. సనాతన ధర్మం శాశ్వతం. హిందూ ధర్మం ఎప్పటికీ తన ప్రత్యేకతను కోల్పోదు.!
పాత్రికేయమంటే బాధ్యతతో కూడిన వృత్తి.! ఆ పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఆర్థికంగా ఎదగడం తప్పు కాదు.
కానీ, డబ్బు కోసం దిగజారిపోవడానికి పాత్రికేయమే ఎందుకు.? దానికంటే, వ్యభిచారం ఇంకా లాభసాటి వ్యాపారమేమో సదరు ఎర్నలిస్టులు ఆలోచించుకుంటే మంచిది.
			        
														