మూడేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ సినిమా. ఈ మధ్యలో నడిచిన రాజకీయం కారణంగా, సినిమాపై చాలా హైప్ వచ్చింది. అభిమానుల కంటే, ఆయా రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలే బహుశా పవన్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ (The Big Fan Behind Vakeel Saab Super Hit) సినిమా కోసం ఎదురుచూశారేమో.!
లేకపోతే, ఓ మంత్రిగారు ‘వకీల్ సాబ్’ సినిమాకి రివ్యూ ఇవ్వడమేంటి.? ఓ ఎంపీ ‘వకీల్ సాబ్’ సినిమా వసూళ్ళ గురించి మాట్లాడటమేంటి.? ‘వకీల్ సాబ్’ సినిమా బడ్జెట్ గురించీ, నటీనటుల రెమ్యునరేషన్ల గురించీ, టిక్కెట్ల రేట్ల గురించీ, సినీ రంగంలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ చర్చ జరిగింది.
Also Read: సినిమా రివ్యూ.. ‘వకీల్ సాబ్’.. ది పవర్ కింగ్.!
ఇదంతా పవన్ మీద ప్రేమ కాదు, దురభిమానం.. రాజకీయ కక్ష సాధింపు. సినీ రంగానికి చాలా సందర్భాల్లో ఇలాంటి నెగెటివిటీ బాగా కలిసొచ్చేస్తుంటుంది. ఎలాంటి వివాదాలూ లేకుండా వుండి వుంటే, కరోనా నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ (Vakeel Saab Collections) వసూళ్ళు చప్పబడిపోయి వుండేవేమో.
కానీ, జనసేన పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే ఓ పార్టీ, ‘వకీల్ సాబ్’ (Vakeel Saab Super Hit) సినిమా ప్రమోషన్లని తన భుజాన వేసుకుంది. మరో రెండు పార్టీలు, ‘వకీల్ సాబ్’ గురించి మంచిగానే మాట్లాడాయి. ఎలాగైతేనేం, కరోనా సెకెండ్ వేవ్ సమయంలో కూడా థియేటర్లకు జనం పోటెత్తారంటే, అదంతా.. ఓ ప్రముఖ రాజకీయ పార్టీ ప్రదర్శించిన పైత్యం కారణంగానే.
Also Read: పొలిటికల్ ‘వకీల్ సాబ్’.. చాచి కొడితే, గూబ గుయ్యిమనాలె.!
పవన్ కళ్యాణ్ (Vakeel Saab Super Hit Top Secret) మీద అభిమానంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమా చేశాడు. ఆయనకి, సినిమా వసూళ్ళనే వ్యవహారం ప్రస్తుతం పెద్దగా పట్టించుకునే అంశం కాదు. తొలి రోజు సినిమా థియేటర్లలో తన సతీమణితో కలిసి సంతోషంగా కాగితాల ముక్కలు ఎరగవేయడంలోనే, ఆయన ఏ ఉద్దేశ్యంతో ఈ సినిమా తీశాడో అర్థమవుతోంది.
ఇక, ‘వకీల్ సాబ్’ (Vakeel Saab Review) సినిమాతో సొసైటీకి ఏం చెప్పాలనుకున్నరో పవన్ కళ్యాణ్ అది చెప్పేశారు. జనం తాము ఏం అర్థం చేసుకోవాలో అదే అర్థం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే, ‘వకీల్ సాబ్’ సినిమాని ఓ రాజకీయ పార్టీ పనిగట్టుకుని గెలిపించిందన్నమాట.
‘మేం చంపేద్దామనుకున్నాం.. కానీ, సినిమా గెలిచింది.. ఇది మా అత్యుత్సాహమే..’ అని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నా, పాపం సదరు పార్టీ ముఖ్య నేతలు మాత్రం, ఇంకా రంకెలేస్తూనే వున్నారు. అలా వాళ్ళు రంకెలేసినంత కాలం, ‘వకీల్ సాబ్’ (The Big Fan Behind Vakeel Saab Super Hit) సినిమాకి అది అదనపు బోనస్ అవుతూనే వుంటుంది.