Tridha Choudhury Glamouraasanam.. ఎవరీ భామ.? చాన్నాళ్ళ క్రితం తెలుగు తెరపై మెరిసిందీ భామ.
తొలి సినిమాతో మంచి హిట్టు అయితే కొట్టిందిగానీ, ఆ తర్వాత తెలుగులో నిలదొక్కుకోలేకపోయింది.
ఈ బ్యూటీ పేరు త్రిధా చౌదరి. సినిమాల సంగతెలా వున్నా, మోడలింగ్‌లో బిజీగానే వుంది. సోషల్ మీడియాలో అయితే ఇంకా యాక్టివ్.
తాజాగా, ఇదిగో ఇలా సోషల్ మీడియా వేదికగా ఓ స్టన్నింగ్ పొటోని పోస్ట్ చేసింది త్రిధా చౌదరి.!
చూస్తున్నారుగా.! ఇదేదో సరికొత్త అసనం అనుకునేరు. ఇది గ్లామరాసనం.! యోగాసనాలు వేసీ వేసీ అలసిపోయి, ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న ఆసనం అన్నమాట.
చక్కనమ్మ ఏం చేసినా అందమేనంటారు.! ఏం చేయకపోయినా కూడా అందమేనని.. ఇదిగో ఈ ఫొటోని చూస్తే అర్థమయిపోవట్లేదూ.!
అందం చూడవయా.. ఆనందించవయా.! అంతే మరి.! అన్నట్టు, త్రిధా చౌదరి ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోందిట.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్.. వాట్ నాట్.. ఏదో ఒకటి చేస్తూ, బిజీగానే వుందిట త్రిధా చౌదరి.