Vaarasudu Dil Raju తమిళ హీరో విజయ్ నటించిన ‘వారిసు’ తెలుగులోకి ‘వారసుడు’ పేరుతో విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడు.. కానీ, తమిళ సినిమా.!
సంక్రాంతికి తెలుగు సినిమాలతోపాటు తమిళ సినిమా విడుదలైతే తప్పేంటి.? నిజానికి, తప్పేమీ లేదు. కానీ, దిల్ రాజు ‘వారసుడు’ విషయంలో చేసిన అతి అంతా ఇంతా కాదు.
గతంలో, సంక్రాంతి పండక్కి డబ్బింగ్ సినిమాలు తెలుగునాట ఎలా రిలీజ్ చేస్తారు.? అని ప్రశ్నించాడు.
ఇప్పుడేమో, స్ట్రెయిట్ తెలుగు సినిమాల్ని కాదని, తమిళ సినిమాని బలవంతంగా తెలుగు ప్రేక్షకుల మీద రుద్దడానికి సిద్ధమయ్యాడు. అదే అసలు సమస్య.
Vaarasudu.. మొండికేశాడుగానీ..
చిరంజీవి అయితే నాకేంటి.? బాలకృష్ణ అయితే నాకేంటి.? నాది యాపారం.. అనేంతలా ‘దిల్’ రాజు వారసుడు విషయమై మొండికేశాడు.
కానీ, చివరికి ఏమయ్యింది.? ‘వారసుడు’ వెనక్కి తగ్గాడు. జనవరి 12న విడుదలవ్వాల్సిన ‘వారసుడు’, జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
‘వారిసు’ మాత్రం జనవరి 11న విడుదలవుతుంది. జనవరి 12న బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, జనవరి 13న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకొస్తాయి.
Vaarasudu Dil Raju అప్పుడెందుకు ఓవరాక్షన్.?
దిల్ రాజు నిన్న మొన్నటిదాకా ఎందుకు ఓవరాక్షన్ చేశాడు.? ఇప్పుడెందుకు దిగొచ్చాడు.? అన్నది వేరే చర్చ. మొత్తానికి మొండితనం వదులుకున్నాడు.
‘వీర సింహా రెడ్డి’ కంటే, ‘వాల్తేరు వీరయ్య’ కంటే కూడా ‘వారసుడు’ సినిమాకే ఎక్కువ థియేటర్లను గతంలో కేటాయించుకున్న ‘దిల్’ రాజుకి తత్వం బోధపడినట్లుంది.
Also Read: Hrithik Roshan.. మనిషివేనా నువ్వసలు.!
అయినా, తెలుగు నిర్మాత అయి వుండీ.. తెలుగు సినిమాల్ని ఎలా దెబ్బ తీయాలనుకున్నాడు తమిళ సినిమాతో.?
జనవరి 14న కాదు, ఇంకో రెండ్రోజులు ఆలస్యంగా ‘వారసుడు’ సినిమాని విడుదల చేసుకుంటే దిల్ రాజుకే మంచిది.!