Table of Contents
తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో మూడో సీజన్‌కి సంబంధించి తొలి వికెట్ సినీ నటి హేమది కాగా, రెండో వికెట్ ఎవరిది.? జాఫర్ జారుకోవాల్సిందేనా.? వరుణ్ సందేశ్, బిగ్ హౌస్‌కి గుడ్ బై చెప్పేస్తాడా.? పునర్నవి తప్పుకోవాల్సిందేనా.? (Bigg Boss Telugu 3 Elimination) వితిక వికెట్ పడిపోతుందా.?
కెప్టెన్‌గా వరుణ్ సందేశ్ ఎంపికైనా, నామినేషన్స్‌లో ఆయన కొనసాగుతుండడం గమనార్హం. మొత్తం ఎనిమిది మంది ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేట్ అయ్యారు. వీరిలో మహేష్ విట్టా, హిమజ, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ సేఫ్ అయినట్లు బిగ్ హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు.
ఇదిలా వుంటే, బిగ్ హౌస్ మేట్స్ మధ్య ‘హీరో – విలన్’ గేమ్ నడిచింది. హ్యాట్రిక్ హీరోగా బాబా భాస్కర్ నిలవడంతో, అతన్ని రేసు నుంచి తప్పించారు. కాగా, విలన్ క్రౌన్స్ ఎక్కువగా దక్కించుకున్నది తమన్నా సింహాద్రి. హౌస్‌లో ఆమె తీరు చాలామందికి నచ్చలేదు. కొందరు మాత్రం, ఆమె ట్రాన్స్‌జెండర్‌గా ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో ‘జాలి’ చూపిస్తూ, హీరోని చేశారు.
పునర్నవి.. మహేష్ మీద విషం చిమ్మింది..
‘సీమ’ స్నేహం.. అంటూనే, మహేష్ విట్టాకి పునర్నవి దిమ్మ తిరిగిపోయే పంచ్ ఇచ్చింది. మహేష్‌లోని నెగెటివిటీని మొత్తం బయటపెట్టేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, మహేష్ ఇమేజ్‌ని బజారుకీడ్చేసింది పునర్నవి.
ఓ వ్యక్తి మీద ఇంత ‘కక్ష’ లోపల వుంటుందా.? అని అంతా ఆశ్చర్యపోయారు పునర్నవి ఇచ్చిన వివరణతో. ‘ప్రవోకింగ్’ (రెచ్చగొట్టడం)లో దిట్ట అని మహేష్‌ని సర్టిఫై చేసింది పునర్నవి. హౌస్‌లో ఇంకెవరూ ఎవరి మీదా ఈ స్థాయి నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. ‘ప్రొవోకింగ్’ని తెలుగులో ఏమంటారో కూడా పునర్నవికి తెలియదట. నమ్మగలమా.?
వరుణ్‌కి బిగ్ మైనస్ పునర్నవి
బాబా భాస్కర్ (Baba Bhaskar), వరుణ్ సందేశ్‌కి (Varun Sandesh) మైనస్ ఇంకెవరో కాదు అతని భార్య వితిక షెరు (Vithika Sheru) అని తేల్చేయడం గమనార్హం. భర్త ఆగ్రహావేశాలకు లోనయినప్పుడు శాంతింపజేయాల్సిందిపోయి, చిన్న విషయాలకే భర్త దగ్గర చెప్పి పెద్ద పెద్ద గొడవలుగా వాటిని మార్చుతోందని బాబా భాస్కర్ చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం. వితిక ఇదే తీరు కొనసాగిస్తే, హౌస్‌లో ఆమెతోపాటు వరుణ్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మనసుల్ని టచ్ చేసిన అలీ..
తనకు దేవుడిచ్చిన సోదరి.. అంటూ శివ జ్యోతి గురించి చెప్పాడు అలీ. బాబా భాస్కర్ తర్వాత ఎక్కువమంది పాజిటివిటీ గురించి మాట్లాడింది అలీ మీదనే. అలీతోపాటు రవి కృష్ణ కూడా మంచి మార్కులు కొట్టేశాడు మిగతా హౌస్ మేట్స్ దృష్టిలో.
పాజిటివిటీలో బాబా భాస్కర్ మెచ్చిన కంటెస్టెంట్ రోహిణి. ఆమె గురించి వీడియో ఫుటేజ్ బయటకు తక్కువగా వస్తున్నా, హౌస్‌లో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్ అని బాబా భాస్కర్ చెప్పడం గమనార్హం. తమన్నాతో గొడవని అలీ లైట్ తీసుకున్నా, ఇంకా తమన్నా తన మనసులో అలీని నెగెటివ్‌గానే భావిస్తోంది. ఆ విషయం తెలుసుకున్న అలీ చాలా బాధపడ్డాడు. ఒకే మనిషిలో రెండు కోణాలు తాను తమన్నాలోనే చూశానని అలీ ఆవేదన వ్యక్తం చేశాడు.

వికెట్ పడేది ఎవరిది.? Bigg Boss Telugu 3 Elimination
జాఫర్, బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్లు గాసిప్స్ విన్పిస్తున్నాయి. కాగా, వితిక మెడ మీద కూడా ‘ఎలిమినేషన్’ కత్తి వేలాడుతోంది. కెప్టెన్ అయినా వరుణ్, నామినేషన్స్‌లో నిలవడం గమనార్హం. పునర్నవి కూడా ఎలిమినేషన్‌లో (Bigg Boss Telugu 3 Elimination) వుంది.