Table of Contents
Vidya Balan సినీ రంగంలో హీరోయిన్లుగా కొనసాగాలంటే, అందంగా వుండాలి. అందం అంటే.. అంత:సౌందర్యం.. అని లాజిక్కులు చెబితే కుదరదు.
అందం అంటే అందమే. బయటికి కనిపించే ఆకర్షణే సినీ రంగానికి కావల్సింది.
స్లిమ్‌గా చూడగానే ఆకట్టుకునేలా వుండాలి. సినీ రంగంలో హీరోయిన్లుగా సక్సెస్ అయిన వాళ్లంతా ఇప్పుడు మనం చెప్పుకున్న క్వాలిటీస్‌తో వున్నవాళ్లేనా.?
మరి, బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ గురించి ఏం చెప్పాలి. బొద్దుగా వుండే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా తన కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు చవి చూసింది. ఆమె బొద్దుతనం ఎక్కడా తన కెరీర్‌కి అడ్డం రాలేదే.!
Vidya Balan చిన్నతనం నుంచీ అవమానాలు భరించి..
చిన్నప్పట్నుంచీ విద్యా బాలన్ బొద్దుగానే వుండేదట. లావుగా వున్నావంటూ అందరూ ఏడిపించేవారట. ఏం చేసినా ఆ బొద్దుతనం తగ్గించుకోవడం కుదరలేదు సరికదా.. అంతకంతకూ ఆ బొద్దుతనం పెరుగుతూ వచ్చేదట.
అలా అని, తన శరీరాన్ని పట్టించుకోకుండా వదిలేయలేదని చెబుతోంది విద్యా బాలన్. తనకు తోచిన వ్యాయామాలన్నీ చేసేదట. బరువు తగ్గడానికి కావల్సిన డైట్ ఫాలో చేసేదట.
తీవ్రమైన ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి..
అయినా కానీ, ఆమె బరువు తగ్గడం సాధ్యం కాలేదని చెప్పుకొచ్చింది. చూసిన వాళ్లంతా బద్దకం తగ్గించుకో.. కాస్త డైట్ ఫాలో చేయ్.. వర్కవుట్లు చెయ్.. అని ఉచిత సలహాలిచ్చేసేవారట.

అవన్నీ చేస్తున్నా.. అని గట్టిగా అరిచి చెప్పాలనిపించేదట విద్యా బాలన్‌కి. కానీ, చెప్పలేకపోయేదట.
సినిమాల్లో అనుకోకుండా ఛాన్స్ వచ్చిన విద్యా బాలన్, మొదట్లో అక్కడా అలాంటి అవమానాలే ఎదుర్కోవల్సి వచ్చిందట. దాంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేదట విద్యా బాలన్.
ఎంత చేసినా తన బరువు తగ్గడానికి తాను కారణం కాదనీ, హర్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ అని తెలుసుకుని, ఆ తర్వాత నుంచి తన శరీరాన్ని ప్రేమించడం మొదలు పెట్టిందట ఈ బోల్డ్ బ్యూటీ.
బ్యూటీ ఆఫ్ కాన్ఫిడెన్స్..
నేనింతే, నా శరీర తత్వం ఇంతే. ఏం చేసినా అది పెరుగుతూనే వుంటుంది కానీ, తరగదు. లావుగా వున్నా నేను ఆరోగ్యంగానే వున్నా కదా.. అని తనను తాను మోటివేట్ చేసుకోవడం మొదలు పెట్టిందట.

హీరోయిన్‌గా సినీ రంగంలో సత్తా చాటింది విద్యా బాలన్. తనదైన శైలిలో నటిగా ముద్ర వేసుకుంది. బోల్డ్ క్యారెక్టర్స్‌లోనూ నటించింది. దీనంతటికీ కారణం తన శరీరాన్ని తాను ప్రేమించుకోవడమే అంటోంది విద్యాబాలన్.
అవమానాలు బారించలేక ఒకానొక టైమ్‌లో సూసైడ్ చేసుకోవాలనుకున్న విద్యా బాలన్.. (Vidya Balan) ఇప్పుడు ఓ సక్సెస్ ఫుల్ హీరోయిన్.
ఎవరి కోసమో తానెందుకు బరువు తగ్గించాలి.? అని క్వశ్చన్ చేసుకుంటే, సమాధానం అందులోనే దొరికిందని తన శరీరాన్ని తాను గౌరవించుకోవడం మొదలు పెట్టాకా, తనకు ఎదురే లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది విద్యా బాలన్.
Also Read: అషు రెడ్డి, ఆర్జీవీ.! ఓ డేంజరస్ గేమ్.!
సహజంగా లావుగా వున్నవాళ్లు చీరకట్టులో ఏమంత అందంగా కనిపించరు. కానీ, విద్యా బాలన్‌లో ఏం మ్యాజిక్ వుందో కానీ, చీరకట్టులో చాలా డిగ్నిఫైడ్‌గా కనిపిస్తుంది.
అలాగే ఏ కాస్ట్యూమ్ వేసినా తనకు అందంగానే వుంటుందిలే అనే కాన్ఫిడెన్స్‌తో వుంటుంది కాబట్టి, ఆటోమెటిగ్గా ఆమెలో ఆ అందం ఆపాదించబడుతుంది.
ఆ కాన్ఫిడెన్స్‌తోనే లావుగా వున్నా, తాను చాలా అందంగా, ఆనందంగా వున్నాననీ, తన శరీరాన్ని ఇప్పుడు చాలా ప్రేమిస్తున్నానని చెబుతోందీ బాలీవుడ్ భామ.
తనలాంటి అమ్మాయిలు ఇలాగే ఫీలయితే, ఎవరేమనుకున్నా డోంట్ కేర్.. అని లావుగా వున్నానని బాధపడే అమ్మాయిలకు స్పూర్తిగా నిలుస్తోంది విద్యా బాలన్.