Viral Picture Buck.. ఈ ఫొటో ఎక్కడిది.? అసలు ఇది నిజమైనదేనా.? ఎవరైనా క్రియేట్ చేసిందా.? అదేనండీ, మార్ఫింగ్ చేసినదేమోనని డౌటానుమానం.!
ప్రకృతి చాలా చిత్రమైనది. ఆ ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు.. ఇంకెన్నో విషాదాలు.! ‘మూగ జీవాలు’ అని ఎందుకు అంటాం.? తమ బాధని అవి ఎవరితోనూ పంచుకోలేవు గనుక.!
ఓ మూగ జీవి ఇలా ఇరుక్కుపోయిందనేది ఈ ఫొటో చెబుతున్న కథ.! పాపం ఎంత బాధ అనుభవించి వుంటుందో కదా.!
అన్నట్టు, సోషల్ మీడియాలో దీన్ని ఉపయోగించి కూడా మీమ్స్ తయారు చేసేస్తున్నారండోయ్.! క్రియేటివిటీకి కాదేదీ అనర్హం.
వద్దురా.! పెళ్ళి చేసుకోవద్దురా.! పెళ్ళి చేసుకుంటే ఇలా ఇరుక్కుపోతావురా.! ఇదో కామెంట్ కనిపిస్తోంది ఈ ఫొటోకి సోషల్ మీడియాలో.
అంతేనా, అమ్మాయి ప్రేమలో పడితే అంతే సంగతులని అబ్బాయిలు అంటోంటే, అబ్బాయి మాయమాటలు నమ్మితే జీవితం ఇలా తగలడుతుందని అమ్మాయిలంటున్నారు.
ఆ జీవి కష్టం.. ఎంతమందికి కామెడీ అయిపోయిందో కదా.?
Mudra369
ఇరుక్కుపోయి, అందులోంచి బయటకు రాలేక.. మూగగా రోదిస్తూ.. చిక్కి శల్యమై.. ప్రాణాలు విడిచింది. చివరికి స్కెలిటన్ మాత్రమే మిగిలింది.!
అడవుల్లో ఇలాంటి దీనగాధలు బోల్డన్ని కనిపిస్తాయి.! అందులో ఇదీ ఒకటి.!
Viral Picture Buck.. దీన్ని ప్రస్తుతానికి అన్వయిస్తే.?
సమస్యల్లో చిక్కుకుపోయి బయటకు రాలేని వ్యక్తి.! లేదా, రాజకీయ పార్టీల మధ్య నలిగిపోతున్న రాష్ట్రం.! కుదిరితే దేశం అని కూడా అనేసుకోవచ్చు.!
ఇలా ఎవరికి తోచిన కథ వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు. ప్రకృతిని వాడేయడంలో మనిషి తర్వాతే ఎవరైనా.! వాడేసుకోవడమే కాదు, నాశనం చేయడంలోనూ ఈ భూమ్మీద మనిషికి సాటి ఇంకెవరూ రారు.
Also Read: Money For Sale.. ఇచ్చట డబ్బులు అమ్మబడును.!
నిజమే, ప్రజలు.. రాజకీయాలు.. వీటితో, ఈ ఫొటోని పోల్చి చూస్తే.. రాజకీయాల మధ్య ప్రజలిలాగే నలిగిపోతున్నారు.
ప్రజాస్వామ్యం ఇలాగే చిక్కి శల్యమవుతోంది కొందరి దుర్మార్గ పాలన కారణంగా.! ఎనీ డౌట్స్.! అనేవారూ లేకపోలేదండోయ్.!రాసుకున్నోడికి రాసుకున్నంత.. అంటే ఇదే మరి.!