Virat Kohli.. కెప్టెన్ కోహ్లీ.. కింగ్ కోహ్లీ.. విరాట్ కోహ్లీ గురించి ఎన్నెన్నో పద ప్రయోగాలు.. అన్నటికీ విరాట్ కోహ్లీ అర్హుడే. ఛేజింగ్ కింగ్ కోహ్లీ.. ఔను, ఎందుకంటే.. టీమిండియా అనూహ్యమైన విజయాల్ని కోహ్లీ కారణంగా సొంతం చేసుకుంది. భారత క్రికెట్‌కి సంబంధించి ఎందరో స్టార్ క్రికెటర్లున్నారు.. అందరిలోకీ విరాట్ కోహ్లీ చాలా చాలా ప్రత్యేకం.
కానీ, ఏం లాభం.. విరాట్ కోహ్లీ (Captain Virat Kohli) కూడా కెరీర్ పరంగా ఎప్పటికప్పుడు సవాళ్ళను ఎదుర్కొంటూనే వచ్చాడు. ఎదుర్కొంటూనే వున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా పరాజయం పాలైన ప్రతిసారీ, దారుణమైన విమర్శలు తప్పడంలేదు. ఇప్పుడు అంతకు మించి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Virat Kohli తప్పు నీ ఒక్కడిదే కాదు..
టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, గ్రూప్ దశను దాటలేకపోయింది. తొలి రెండు మ్యాచ్‌లను కోల్పోయి, టోర్నీలో అత్యంత పేలవమైన ప్రదర్శనతో విమర్శల్ని ఎదుర్కొంది. రెండు పెద్ద జట్ల మీద ఓడి, ఆ తర్వాత చిన్న జట్ల మీద గెలిచినా.. ఫలితం లేకుండా పోయింది.

టీ20 వరల్డ్ కప్ పోటీల తర్వాత, కెప్టెన్సీకి దూరమవుతాననీ, ఆటగాడిగా కొనసాగుతాననీ కొన్నాళ్ళ క్రితం కోహ్లీ ప్రకటించిన విషయం విదితమే. కెప్టెన్‌గా కప్పు కొట్టి.. ఆ తర్వాత కెప్టెన్సీకి గౌరవప్రదంగా కోహ్లీ గుడ్ బై చెప్పాలని అభిమానులు భావించారు.. కానీ, అలా జరగలేదు.
‘కలిసికట్టుగా మేం పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. ఇంతకంటే మాకు బాధాకరమైన విషయం ఇంకోటుండదు. మీ అందరి ప్రేమాభిమానాలు మాకు కావాలి. మీ ప్రేమాభిమానాల్ని మేమెప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. మరింత బలంగా ముందుకు దూసుకొచ్చేందుకు కష్టపడతాం.. జై హింద్..’ అంటూ భావోద్వేగపూరితమైన మెసేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ.
కేవలం బ్యాడ్ టైమ్ మాత్రమే కారణం కాదు..
ఆటలో గెలుపోటములు సహజం. కానీ, దాయాది పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమిని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ మీద ప్రపంచ కప్ వేదికలపై ఓటమి ఎరుగని టీమిండియా, తొలిసారి ఓటమి చవిచూడటమే అందుక్కారణం. అదీ కోహ్లీ (King Kohli) సారధ్యంలో కావడం ఇంకా బాధాకరం. ఈ గాయం ఎప్పటికీ మానదు.
Also Read: కెప్టెన్ కోహ్లీ తప్పుకున్నాడా.? తప్పించేశారా.?
కేవలం బ్యాడ్ టైమ్.. అని కొట్టి పారేయలేం.. అంతకు మించి.. ఇది టీమిండియా ఎప్పటికీ మర్చిపోలేని ఓటమి. కానీ, టీమిండియా (Team India) ఎప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో మేటి జట్టు.. బ్యాడ్ టైమ్.. దాంతోపాటుగా, ఆటగాళ్ళలో చిన్నపాటి నిర్లక్ష్యం.. వెరసి టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది.