VJ Ssunny Unstoppable.. చాలా ఆశలు పెట్టుకుని సినీ రంగంలోకి వచ్చాడు. తన సినిమాకి నెగెటివ్ రివ్యూలు రావడంతో తట్టుకోలేకపోయాడు.!
ఇక్కడి వరకూ వీజే సన్నీ.. అదేనండీ బిగ్ బాస్ సన్నీ ఆవేదన అర్థం చేసుకోదగ్గదే.! కానీ, ‘ఏసీ రూముల్లో కూర్చుని రివ్యూలు రాస్తారు’ అని వెటకారాలు చేస్తే ఎలా.?
సినిమా రివ్యూ రాయాలంటే, సినిమాలు తీయడం రావాల్సిన పనిలేదు.!
VJ Ssunny Unstoppable.. ఓ బిర్యానీ కథ.!
మాంఛి బిర్యానీ.. అని ఎవరో చెబితే, తినడానికి వెళతాం. అక్కడికి వెళ్ళాక బిర్యానీ చెత్తగా వుంటే ఏం చేస్తాం.? తిట్టుకుంటాం.!
‘ఎవడూ అక్కడికి బిర్యానీ కోసం వెళ్ళొద్దు..’ అని పది మందికి చెప్తాం కూడా.! అంత మాత్రాన, బిర్యానీ బాగోలేదని చెప్పడానికి బిర్యానీ తయారు చెయ్యడమెలాగో తెలిసుండాలని అంటే ఎలా.?

సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ కష్టపడతాయి. చెత్త సినిమాకైనా, సూపర్ హిట్ సినిమాకైనా.. కష్టం దాదాపు ఒకేలా వుంటుంది.!
ఆ అతి బిగ్ బాస్‌కి నచ్చిందేమోగానీ..
వీజే సన్నీ అతి బిగ్ బాస్‌కి నచ్చిందేమో.! అందుకే, అతను విన్నర్ అయ్యాడేమో.! అది వేరే కథ.!
సినిమా లెక్కలు వేరేలా వుంటాయ్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఫెయిలయితే, అందులో కంటెంట్ లేదని స్వయానా చిరంజీవి ఒప్పుకున్నారు.
‘మా ప్రయత్నం అనుకున్న స్థాయిలో వర్కవుట్ అవలేదు’ అని యంగ్ హీరో అక్కినేని అఖిల్ కూడా ‘ఏజెంట్’ విషయంలో ఒప్పుకోవాల్సి వచ్చింది.
Also Read: పూజా హెగ్దే ఔట్.! మృనాల్ ఠాకూర్ ఇన్.! ఎందుకంట.?
చిరంజీవికి (Mega Star Chiranjeevi) చేతకాకనా మీడియాని తిట్టడానికి.? అఖిల్ అక్కినేని (Akhil Akkineni) తిట్టలేకనా.. ‘నోట్’ విడుదల చేసింది.?
వీటినే ఎక్స్‌ట్రాలు.. అంటారు.! సన్నీ (VJ Sunny), కాస్త వీటిని తగ్గించుకుంటే మంచిది.!
ఇంతకీ, సన్నీ సినిమా ఏంటో తెలుసా.? ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో కూడా తెలియని ఆ సినిమా పేరు ‘అన్‌స్టాపబుల్’.!
ఒక్కటంటే ఒక్క రివ్యూలోనూ వీజే సన్నీ బాగా నటించాడనిగానీ, ఓ మోస్తరుగా నటించాడనిగానీ పేర్కొనలేదు.
అన్ని రివ్యూల్లోనూ ‘సింగిల్ ఎక్స్‌ప్రెషన్ సన్నీ’ అనే తేల్చేశారు.! అదీ, అక్కడే బాగా సన్నీకి ఎక్కడో కాలిపోయినట్టుంది.!