Vodka Jeevi Publicity Paithyam.. అదొక వికారపు జీవి. దానికి ‘ఎర్రి’ చాలా ఎక్కువ.! ఎర్రి, అదేనడీ వెర్రి.! దాన్ని పైత్యం అని కూడా అనొచ్చు. నేను, నా పైత్యం అంటాడా వికారపు జీవి. దాన్ని శునకంతో పోల్చితే, శునకాన్ని అవమానించినట్టేనేమో.!
ఏనుగుని చూసి శునకం మొరగడం సహజం. ఔను, ‘ద్రౌపది గనుక ప్రెసిడెంట్ అయితే పాండవులు ఎవరు.? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు.?’ అని అత్యంత వికారంగా మొరిగాడంటే, వాడ్ని శునకం అని కూడా అనడానికి వీల్లేదు.
మొత్తం శునక జాతి అది పెద్ద అవమానంగా భావిస్తుందేమో.! మొరగడం శునకం తాలూకు నైజమే. ఎవర్ని చూసినా మొరుగడమే దాని పని. కానీ, ఎప్పుడో ఒకప్పుడు ఆ మూతి పగిలిపోవొచ్చుగాక.!
Vodka Jeevi Publicity Paithyam.. పబ్లిసిటీ పిచ్చోడు.!
తనకు పబ్లిసిటీ కావాలనుకున్నప్పుడల్లా ఇలాంటి పిచ్చివేషాలేయడం, ఆ ఎర్రి జీవికి అలవాటే. ఈ క్రమంలోనే, తాజాగా ‘ప్రెసిడెంట్’ మీద పబ్లిసిటీ స్టంట్ చేశాడు.
పబ్లిసిటీ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతాడు ఆ ఎర్రి జీవి. దిగజారిపోవడం.. అనే మాటకే బ్రాండ్ అంబాసిడర్ తాను తప్ప ఇంకెవరూ కాదని పదే పదే నిరూపించేసుకుంటుంటాడు.

చిత్రమేంటంటే, ఇలాంటోడ్ని కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంటర్టైన్ చేయడం. మీడియా ఆ స్థాయికి దిగజారిపోయింది మరి.!
Also Read: ప్యారిస్ చెక్కేసిన మలైకా, అర్జున్.! అయితే ఏంటట.?
డబ్బే వెదజల్లుతాడో, తనకు బాగా అలవాటైన వోడ్కానే పోస్తాడో.. ఇవేవీ కాదు, ‘ఫిగర్లనే’ సప్లయ్ చేస్తాడోగానీ, ఈ వింత జీవికి పబ్లిసిటీ కావాల్సినప్పుడల్లా, సోకాల్డ్ మీడియా ‘జీ హుజూర్’ అంటుంది.
ముందు సోకాల్డ్ మీడియా పైత్యం వదిలితే, వీడి పైత్యం కూడా ఆటోమేటిక్‌గా అంతరించిపోవచ్చు.! కానీ, అది సాధ్యమయ్యే పని కాదు. మొరిగే కుక్క కరవదు.! ఔను, అందుకే, ఏదీ ఏడవలేక ఈ మొరుగుడు.!