Table of Contents
Web Charam Cine Journalism.. ఫలానా హీరోయిన్‌తో ఫలానా హీరో ‘క్లోజ్’గా వుంటున్నాడట.! ఫలానా హీరోతో, ఫలానా హీరోయిన్ రాసుకు పూసుకు తిరుగుతోందిట.!
ఇలాంటి గాసిప్స్ వరకూ.. ఫర్లేదేమో.! సినిమా అంటే, గ్లామర్ ప్రపంచం గనుక, ఆ గ్లామర్ ప్రపంచంలోని గాజుబొమ్మల్లాంటి సినీ జనాల మీద, రాళ్ళేయడం ఓ పైశాచికానందం కొందరికి.
కానీ, పెళ్ళయిన హీరోయిన్‌తో ఓ హీరో రాత్రంతా ఓ హోటల్‌లో ‘గడిపాడు’ అంటే, ఎలా వుంటుంది.? అత్యంత అసహ్యంగా వుంటుంది.
Web Charam Cine Journalism.. దీన్నే వెబ్..చారమ్ అంటారు.!
ఔను, వ్యభిచారానికీ, వెబ్..చారానికీ పెద్దగా తేడా లేదు.! ఓ హీరోతో సన్నిహితంగా వుండే హీరోయిన్, హైద్రాబాద్‌లో హోటల్ తీసుకుని, హీరోతో.. గడిపిందనే వార్త ఎంత అభ్యంతరకరం.?
దీన్ని కడుపుకి అన్నం తినేవాడెవడైనా ‘గాసిప్’ అనగలడా.? ప్చ్.. అస్సలు అనలేడు.
కన్న తల్లినీ, కట్టుకున్న భార్యనీ, కడుపున పుట్టిన బిడ్డనీ ‘వెబ్..చారమ్’లోకి దింపగలిగేవాడే ఇలాంటి వెకిలి వేషాలు వేయగలడు.
అవకాశాల్లేక..?
హీరోతో క్లోజ్‌గా మూవ్ అవడం వల్ల, అతని ఒత్తిడి కారణంగా మంచి మంచి అవకాశాలు వదిలేసుకుందట. ఇప్పుడు అవకాశాల కోసం వెంపర్లాడుతోందిట.
అదే పని మీద, ఓ హోటల్ గదిలో దిగితే, అది తెలుసుకుని.. ఆ హీరో అక్కడికి వెళ్ళొచ్చాడట. ఆ హీరోయిన్‌కి ఆల్రెడీ పెళ్ళయిపోయిందట.
ఈ మధ్యనే ఓ హిట్టు కొట్టిందట.. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిందట.. ఇదీ, ఆ వెకిలి గాసిప్ అసలు కథ.!
‘Dare To Write’ అని ట్యాగ్ తగిలించుకున్న సదరు ‘వెబ్..చారమ్’ రోత వీరుడు, రాసింది నిజమే అయితే, అందులో ఆ పేర్లు పెట్టి చావాలి కదా.?
బట్ట కాల్చి మొహాన వేయడమే..
దీన్ని పాత్రికేయం.. అని ఎవరూ అనలేరు. అనాల్సింది, పాత్రికేయ వ్యభిచారం అని. పక్కలెయ్యడం బాగా అలవాటు పడిపోతే, ఇదిగో ఇలాంటి రాతలే వస్తాయ్.
చిత్రమేంటంటే, ఈ ‘వెబ్..చారమ్’ అనే పాత్రికేయ వ్యభిచారాన్ని, సినీ పరిశ్రమ ఎందుకు భరిస్తోంది.? లక్షలకు లక్షలు, ప్రకటనల పేరుతో సొమ్ములు దోచిపెట్టడమేంటి.?
ఏదిఏమైనా.. ఈ వెబ్ చారమ్‌పై ఉక్కుపాదం మోపాల్సిందే.
అదే సమయంలో, వ్యూస్ కోసం కక్కుర్తి పడి, ‘వెబ్ చారమ్’ నడిపే వాళ్ళపై, వాళ్ళ ఇళ్ళల్లోని మహిళలే మొహాన ఉమ్మేయాల్సి వుందన్నది అంతటా వినిపిస్తున్న మాట.
పైన పోస్ట్ చేసిన ఫొటోతోనే, ఆ దిక్కుమాలిన ‘గాసిప్’ ప్రచారంలోకి వచ్చింది. విషయం చేరాల్సిన వాళ్ళకి చేరాలనే, ఆ ఫొటోని యథాతథంగా వాడటం జరిగింది.