Table of Contents
Young Tiger NTR Politics: అభిమానుల ఆలోచనలు రకరకాలుగా వుండొచ్చు. కానీ, రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించగలం.? అన్నదానిపై ఓ అవగాహనకు వచ్చాక మాత్రమే రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వుంటుంది.
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారు.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) రాజకీయాల్లోకి రావడం ద్వారా సాధించినదేంటి.?
అన్నిటికీ మించి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (TDP MLA Nandamuri Bala Krishna) రాజకీయాల్లో వుండి ఏం సాధిస్తున్నారు.? ఈ అంశాలపై యంగ్ టైగర్ ఎన్టీయార్ విశ్లేషణ చేయకుండా వుంటాడా.?
ఒకప్పుడు రాజకీయాలంటే, ప్రజలు.. ఆయా వ్యక్తుల్లోని నాయకత్వ లక్షణాల్ని చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.
కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు నడుస్తున్నాయిప్పుడు. ఎన్నికల వేళ కరెన్సీ నోటు, లిక్కర్ బాటిల్, బిర్యానీ.. ఇలాంటివన్నీ ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయ్.
Young Tiger NTR Politics.. అప్పటి రాజకీయం వేరు.. ఇప్పుడు వేరు.!
సరే, అందరూ వాటికి ప్రలోభపడే ఓట్లు వేస్తున్నారని అనడమూ సబబు కాదు. కానీ, వాటి ప్రభావం రాజకీయాలపై చాలా ఎక్కువైపోయింది. వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేసి అధికారంలోకి వచ్చాక.. అంతకు మించి సంపాదించుకోవడమే నేటి రాజకీయం.
స్వర్గీయ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) తెలుగుదేశం పార్టీని (TDP) స్థాపించిన రోజులు వేరు. అప్పట్లో రాజకీయ శూన్యత వుండేది.
ఇప్పుడూ ఆ శూన్యత వున్నా, ఆ శూన్యతని పైన చెప్పుకున్నట్లుగా డబ్బు, కులం, మతం, ప్రాంతం.. వీటన్నిటి ఆధారంగా మాత్రమే పార్టీలు లేదా వ్యక్తులు భర్తీ చేస్తున్న పరిస్థి.

ప్రతిసారిలానే ఇంకోసారి యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) ముందుకు ‘రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నారు.?’ అన్న ప్రశ్న వచ్చింది. దానికి ఆయన షరా మామూలుగానే సమాధానమిచ్చారు.
గాయం శరీరానికే కాదు, మనసుకీ అయ్యింది.!
‘ఇప్పటికైతే సినిమాల్లో హ్యాపీగా వున్నాను. భవిష్యత్తు గురించి మరీ ఎక్కువగా ఆలోచించెయ్యను. నటుడిగా ఇంకా సాధించాల్సింది చాలా వుంది..’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ (Jr NTR) వ్యాఖ్యానించాడు.
గతంలో.. అంటే, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ (Telugu Desam Party) తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలోనే యంగ్ టైగర్ ఎన్టీయార్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు.
గాయాలు శరీరానికే కాదు, మనసుకీ అయ్యాయ్. అందుకే, రాజకీయ తెరపై కనిపించాలన్న ఆలోచన బహుశా ఆయనలో చచ్చిపోయి వుండొచ్చన్నది సర్వత్రా వినిపించే అభిప్రాయం.
అభిమానుల్ని నమ్ముకుంటే అంతే మరి.!
అభిమానులు మాత్రం, ‘అన్నా.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? రాజకీయాల్లోకి వచ్చెయ్.. మేం చూసుకుంటాం..’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని (Young Tiger NTR Politics) రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ నినాదాలు చేస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ గర్జిస్తే అవెందుకు మొరుగుతున్నాయ్.!
సినీ అభిమానులు సినీ నటుల్ని రాజకీయ తెరపై ఎంతవరకు ‘నాయకులు’గా ఆదరిస్తారు.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
అసలు అలాంటి సినీ అభిమానుల్లో ఎంతమందికి ఓటు హక్కు వుంది.? అన్నదానిపైనా చాలా అనుమానాలున్నాయ్.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విషయంలో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా చూస్తున్నాం.! సో, ఎన్టీయార్ (Young Tiger NTR) ఆ రిస్క్ తీసుకునే అవకాశం లేదు.