Home » డౌటేముంది.? అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకమే.!

డౌటేముంది.? అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకమే.!

by hellomudra
0 comments
Ys Jagan Mohan Reddy

YS Jagan Against Amaravati.. రాష్ట్ర రాజధాని అంటే, అది రాష్ట్ర ప్రజలకు ఆత్మ గౌరవం లాంటిది.! ఇందులో వేరే మాటకు తావు లేదు.!

రాజదాని చుట్టూనే అభివృద్ధి జరుగుతుంది.. ఆ రాజధాని, రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు అవుతుంది. రాజధానిలోనే, విద్య అలానే ఉపాధి అవకాశాలుంటాయ్.

సమగ్రాభివృద్ధి జరగాల్సిందే. అలా జరగడానికైనా సరే, రాజధాని అవసరం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, రాజధాని లేకుండా పోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అత్యవసరం.

దురదృష్టవశాత్తూ, ఆంధ్ర ప్రదేశ్ రాజదాని అమరావతిపై వైసీపీ విషం చిమ్మింది.. ఐదేళ్ళు అధికారంలో వుండి, అమరావతిపై కుట్ర పూరితంగా వ్యవహరించింది.

YS Jagan Against Amaravati.. ఎడారి.. కమ్మరావతి… ఎందుకింత ద్వేషం.?

అమరావతిని కమ్మరావతి అనీ, ఎడారి అనీ, స్మశానమనీ.. అమరావతిపై వైసీపీ చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ, ఇప్పుడు అదే వైసీపీ, అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెబుతోంది.

ఊహా రాజధాని అమరావతికి వ్యతిరేకం తప్ప, ప్రజా రాజధాని అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకం కాదంటూ, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వింత వాదనను తెరపైకి తెచ్చారు.

కానీ, రాజధాని అమరావతికి వైసీపీ చేసిన అన్యాయమే, వైసీపీ ఓటమికి ప్రధాన కారణమన్న విషయాన్ని వైసీపీ మర్చిపోతే ఎలా.? ఇంకా బుకాయించాలని ప్రయత్నిస్తే వైసీపీ మరింత నష్టపోతుంది.

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకోసం, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశమయ్యింది.

అసెంబ్లీకి డుమ్మా కొట్టిన జగన్..

వైసీపీకి చిత్తశుద్ధి వుంటే, వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకం కాకుంటే, అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరై వుండేవారే.

అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైఎస్ జగన్ డుమ్మా కొట్టారంటేనే, అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకమని అర్థం.

నరనరానా అమరావతి పట్ల అక్కసు, ద్వేషం నింపేసుకున్న వైఎస్ జగన్, అమరావతికి వ్యతిరేకం కాదని సజ్జల చెప్పడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

అయినా, అమరావతి మీద అంత ద్వేషం వైఎస్ జగన్ ఎందుకు పెంచుకున్నారో ఏమో.? ఓ ప్రాంతం మీద ద్వేషం పెంచుకున్న వ్యక్తి, రాజకీయాలకు అనర్హుడు.

చిత్రమేంటంటే, ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది అమరావతి నుంచే. తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం అంటారు దీన్నే.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group