Home » సమంత.. అప్పుడేనా.?

సమంత.. అప్పుడేనా.?

by Mudra369 Editorial Desk
0 comments
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu Again.. పెళ్ళయ్యాక, తల్లి కాక ముందు సమంత నటించిన సినిమా ‘మా ఇంటి బంగారం’.! ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!

ఇటీవల ‘దేవ్’కి జన్మనిచ్చిన సమంత, మళ్ళీ సినిమాల్లోకి వచ్చేయడానికి సమాయత్తమవుతోందా.? ఏం, ఎందుకు తిరిగి సమంత సినిమాల్లో నటించకూడదు.. ఎంచక్కా నటించేయొచ్చు.!

కాకపోతే, మాతృత్వపు మధుర క్షణాల్ని ఇంకొన్నాళ్ళు సమంత ఆస్వాదించనుంది. ఆ తర్వాతే, సినిమాల్లో తిరిగి నటించడంపై సమంత నిర్ణయం తీసుకోనుంది.

కానీ, గాసిప్స్ ఆగవు కదా.! సమంత ఫలానా సినిమాకి ఆల్రెడీ ఓకే చెప్పేసిందంటూ, కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వస్తున్నాయి.

Samantha Ruth Prabhu Again.. తమిళ సినిమా సెట్టయిపోయిందా రీ-ఎంట్రీ కోసం.?

అందులో, ఓ తమిళ సినిమా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో వచ్చిన ఓ తమిళ సినిమాకి సీక్వెల్ షురూ అయ్యింది, అందులో సమంత నటించబోతోందన్నది తాజా గాసిప్స్ సారాంశం.

మరోపక్క, సమంత లాస్ట్ రిలీజ్ ‘మా ఇంటి బంగారం’ సినిమాకీ సీక్వెల్ రావాల్సి వుంది. ఆ సీక్వెల్‌లోనూ సమంతనే కదా నటించేది.!

Samatha Ruth Prabhu
Samatha Ruth Prabhu

ఇవన్నీ కాదు, ఓ వెబ్ సిరీస్ దిశగా సమంతని ఒప్పించేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, సమంతతో గతంలోనే చర్చలు జరిపిందనే ఊహాగానాలు గుప్పుమంటున్నాయ్.

నటిగా సమంత, తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసింది. సమంత కెరీర్ ముగిసిపోయిందనుకున్న ప్రతిసారీ ఆమె బౌన్స్ బ్యాక్ అవుతూనే వుంది.

బౌన్స్ బ్యాక్ అవడమెలాగో సమంతకి తెలుసు..

తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి సమంత ఓ ఫైటర్‌లా బౌన్స్ బ్యాక్ అయిన తీరుని ఎలా మర్చిపోగలం.? సో, రీ-ఎంట్రీ విషయమై సరైన నిర్ణయం సరైన సమయంలో సమంత తీసుకోగలదు.

త్వరలోనే సమంత నుంచి, తదుపరి సినిమాపై ఓ స్పష్టత వస్తుంది. ఈలోగా గాసిప్స్ కొనసాగుతూనే వుంటాయనుకోండి.. అది వేరే సంగతి.

Also Read: మృణాల్ జడల్ సోయగాల్.. జిల్ జిల్ జిగేల్.!

బిడ్డకు జన్మనిచ్చాక బాలీవుడ్ నటి అలియా భట్ సినిమాల్లో నటిస్తూనే వుంది. దీపికా పదుకనే సంగతి సరే సరి.! వాళ్ళ స్టార్‌డమ్ ఏమాత్రం తగ్గలేదు.

సో, సమంత నుంచి కూడా ముందు ముందు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రానున్నాయన్నది నిర్వివాదాంశం.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, సమంత రీ-ఎంట్రీ స్ట్రెయిట్ తెలుగు సినిమాతోనేనట.! ఎటూ అది, ఇతర భాషల్లోనూ విడుదలవుతుందనుకోండి.. అది వేరే సంగతి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Editor's Picks

Most viewed

trending

© 2026, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group