Godfather Chiranjeevi చిరంజీవికి ‘పవర్’ ఇచ్చేది పవన్ కళ్యాణ్.! ప్రజారాజ్యం సమయంలో ఆ ‘పవర్’ని చూశాం. మరి, జనసేన పార్టీకి చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ అవుతారా.? అవ్వరా.?
ఎవడో అన్నాడు, చిరంజీవికి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడని. పాలేరుగాడి నుంచి అంతకన్నా గొప్ప మాటల్ని ఎలా ఆశించగలం.?
చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు. అంతకు మించి, అన్నయ్యని తండ్రిలా గౌరవించే తమ్ముడు.. తమ్ముడ్ని అన్నలా చూసుకోవడమే కాదు, తండ్రిలా బాధ్యతగా చూసుకునే అన్నయ్య.!
Godfather Chiranjeevi.. గాడ్ ఫాదర్ అంటే అర్థమిదే.!
ఎవరో అడిగారు తాజాగా చిరంజీవిని, ‘మీరు పవన్ కళ్యాణ్‌కి రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అవుతారా.?’ అని. ‘ఆ మాట నేను చెప్పకూడదు, పవన్ కళ్యాణ్ చెప్పాలి..’ అన్నారు చిరంజీవి హుందాగా.

‘మా అన్నయ్య నాకు తండ్రి లాంటివాడని నా తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా.. ఔను, వాడు నా బిడ్డ లాంటోడు..’ అని చిరంజీవి చెప్పాక, ‘గాడ్ ఫాదర్’ అనే మాట విషయంలో రెండో థాట్ ఎందుకు వస్తుంది.?
పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, అవుతాడు.!
పవన్ కళ్యాణ్ నిబద్ధత ఏంటో తనకు తెలుసని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ప్రజల కోసం నిలబడే నిఖార్సయిన నాయకుడిగా పవన్ కళ్యాణ్‌ని చిరంజీవి అభివర్ణించారు.
తాను రాజకీయాలకు దూరంగా సినిమాల్లో వుండటమే పవన్ కళ్యాణ్‌కి కరెక్టని చిరంజీవి చెప్పడంలో పెద్ద అర్థమే వుంది. తన మద్దతు తన తమ్ముడికి ఎప్పుడూ వుంటుందని చిరంజీవి స్పష్టం చేసేశారు.
సో, మేటర్ క్లియర్.! చాలామంది ఫాల్తూగాళ్ళ నోళ్ళకు మెగాస్టార్ చిరంజీవి తాళం వేసేశారు. ఎవరో అడిగిన ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెప్పారు తప్ప, ‘పెంపుడు శునకాలేవో మొరిగాయని’ వివరణ ఇవ్వలేదు.!
Also Read: Megastar Chiranjeevi ‘గాడ్ ఫాదర్’ ఎవరు.?
టైమింగులో మెగాస్టార్ చిరంజీవి ‘ది బెస్ట్’.! ఇది అందరికీ తెలిసిన విషయమే. సినిమాల్లో కామెడీ టైమింగ్ అయినా, రాజకీయాల్లో శతృవులు, ప్రత్యర్థులకు కౌంటర్ ఎటాక్ ఇవ్వాలన్నా మెగాస్టార్ చిరంజీవి రూటే సెపరేటు.!
అయినా, అన్నదమ్ముల మధ్య ఫిట్టింగు పెట్టగలమనేంత మూర్ఖత్వం సోకాల్డ్ ‘చిడతల బ్యాచ్’కి ఎలా సాధ్యమైంది చెప్మా.? మూర్ఖులకి, మూర్ఖత్వం కాక, తెలివి వుంటుందా.?