Home » ముద్రాభిప్రాయమ్: రాజీనామాకి మమత ‘ససేమిరా’.!

ముద్రాభిప్రాయమ్: రాజీనామాకి మమత ‘ససేమిరా’.!

by hellomudra
0 comments
mamata banerjee

Mamata Banerjee Dirty Politics.. ముఖ్యమంత్రి పదవిపై మమకారం తీరినట్లు లేదు.. ఆ పదవిని వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ స్వయంగా ఓడిపోయారు.. మమత పార్టీ కూడా వంద సీట్ల మార్కుని అందుకోలేకపోయింది.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సంచలన విజయాన్ని అందుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. ఇంతలోనే, రాజీనామాకి మమతా బెనర్జీ ససేమిరా అంటున్నారు.

Mamata Banerjee Dirty Politics.. ఇదేం ట్విస్టు మహాప్రభో..

సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయాక, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే ఎవరైనా. 2024 ఎన్నికల్లో ఓడిన వైఎస్ జగన్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన పదవికి రాజీనామా చేశారు.

కేసీయార్ తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి గతంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఓడితే, రాజీనామా చేయాల్సిందే.. వేరే ఆప్షన్ వుండదు.

కాదూ, చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం మారాం చేసినట్లుగా, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిని వదలనని భీష్మించుక్కూర్చుంటే, పదవిలోంచి ఆమెని బలవంతంగా పీకేస్తారు.

ఏంటీ నాన్సెన్స్..

అలా పీకెయ్యడానికి, రాష్ట్ర గవర్నర్‌కి అన్ని అదికారాలూ వున్నాయి. అసెంబ్లీలో బల ప్రదర్శన.. లాంటి వ్యవహారాల దాకా మేటర్ వెళ్ళకపోవచ్చు.

ఇప్పటికిప్పుడు ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేని మమత, ఈ తరహా నాన్సెన్స్ క్రియేట్ చేయడంలో వింతేమీ లేదు. ఆమె వ్యవహార శైలే అంత.

ఒకప్పుడు మమతా బెనర్జీ అంటే, దేశ రాజకీయాల్లో ఐరన్ లేడీ.. అనే గుర్తింపు వుండేది. దురదృష్టవశాత్తూ, ‘కిలేడీ’ అనే గుర్తింపుని సంపాదించుకున్నారామె గత కొన్నేళ్ళుగా.

మెడపట్టి గెంటేయాల్సిందేనా.?

పశ్చిమ బెంగాల్ శాశ్వతంగా తనదే.. అన్నట్లుగా మమతా బెనర్జీ మూర్ఖత్వం ప్రదర్శించారు. అందుకే, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆమెను ఛీత్కరించారు ఇటీవలి ఎన్నికల్లో.

ఇప్పటికైనా, బెట్టు వీడి.. ముఖ్యమంత్రి పదవికి హుందాగా రాజీనామా చేస్తే, అది మమతా బెనర్జీకే మంచిది.

లేదూ, మమతా బెనర్జీని మెడ పట్టి ఆ పదవి నుంచి కిందికి లాగే పరిస్థితి వస్తే.. దేశ రాజకీయాల్లో ఇదో సరికొత్త చరిత్ర అవుతుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group