Anupama Parameswaran Luck.. మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.. మన తెలుగమ్మాయిలానే మారిపోయింది. తెలుగు తెరపై ఆమె కనిపించిన ‘విధానం’ అలాంటిది మరి.!
ట్రెండీ దుస్తుల్లో కనిపించినాసరే, పక్కింటమయ్యాయి.. మన ఇంట్లో అమ్మాయిలా కనిపిస్తుంటుంది. అదే అనుపమ ప్రత్యేకత.!
అయినాగానీ, అనుపమ పరమేశ్వరన్‌కి తెలుగునాట ఇంకా దక్కాల్సిన స్థాయి స్టార్‌డమ్ అయితే దక్కలేదని చెప్పొచ్చు.!
Anupama Parameswaran Luck.. బ్యాక్ టు బ్యాక్ హిట్లు..
అనుపమకి ఈ మధ్య తెలుగులో మంచి మంచి సినిమాలే పడ్డాయ్. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ‘బటర్‌ఫ్లై’ సంగతి పక్కన పెడితే, ‘కార్తికేయ-2’, ‘18 పేజెస్’ ఆమెకు మంచి విజయాల్నిచ్చాయి.

ఈ క్రమంలోనే అనుపమకి అవకాశాలు పోటెత్తుతున్నాయ్. తాజాగా ఓ సీనియర్ హీరో సరసన అనుపమకి ఛాన్స్ వచ్చిందట.
Also Read: గోకుడు రోగం.! నయనతార.. నువ్వు కూడానా.?
సీనియర్ హీరోతో సినిమా అంటే.. యంగ్ హీరోల సరసన ఛాన్సులు ఇకపై గల్లంతేనా.? అన్న చర్చ జరుగుతోంది.
ఆ సీనియర్ హీరో ఎవరో కాదు, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అట. అందులో నిజమెంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఒకవేళ సీనియర్ హీరో సరసన అనుపమ నటిస్తే.. ఆమె రిస్క్ చేస్తున్నట్టా.? సీనియర్ హీరో సరసన ఛాన్సొచ్చింది గనుక లక్కు తోక తొక్కినట్టా.?