Table of Contents
Nail Polish Health Problems.. వేసుకోవడం అంటే ఇష్టపడని మహిళలుండరంటే అతిశయోక్తి వుండదు.
ఏ డ్రస్‌కి ఆ మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకుంటే ఆ కిక్కే వేరప్పా. సింగిల్ కలర్ కాదు, మల్టీ కలర్ నెయిల్ పాలిష్‌తో డిజైన్లు చేసుకోవడం నయా ట్రెండ్.
దాన్నే నెయిల్ ఆర్ట్‌గా పిలుస్తున్నాం. నయా ట్రెండ్‌లో నెయిల్ ఆర్ట్‌కి పిచ్చ పిచ్చగా డిమాండ్ వుంది. పొడవాటి గోళ్లు.. వాటిపై అందమైన రంగు రంగుల నెయిల్ పాలిష్ డిజైన్లు వేసుకుని తెగ మురిసిపోతుంటారు అమ్మాయిలు.
అందుకే అందమైన నెయిల్ ఆర్ట్‌తో కూడిన ఆర్టిఫిషియల్ నెయిల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో వున్నాయ్.
సరే, నెయిల్ ఆర్ట్‌లో కీలక పాత్ర పోషించేది నెయిల్ పాలిష్. ఇప్పుడా నెయిల్ పాలిష్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం.
Nail Polish Health Problems.. అంత ప్రమాదమా.!
అంతా బాగానే వుంది. అందమైన నెయిల్ ఆర్ట్ సంగతి సరే సరి. అసలు గోళ్లకి నెయిల్ పాలిష్ వేసుకోవడం ఎంతవరకూ సేఫ్.! ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్.
నెయిల్ పాలిష్‌లో మెథాక్రిలేట్స్ అనే కెమికల్ వుంటుంది. ఇది గోళ్ల ద్వారా చర్మంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా అనేక అలర్జీలకు కారణమవుతుంది.

కొందరికైతే ఈ అలర్జీ పెను ప్రమాదంగా మారే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయ్.
గట్టిగా చెప్పాలంలే ఇంత ప్రమాదకరమైన రసాయనాలున్న నెయిల్ పాలిష్‌ని గోళ్లకు వేసుకోకపోవడమే మంచిదంటున్నారు.
కెమికల్స్ లేని నెయిల్ పాలిష్ వేసుకుంటే పోలా.!
కెమికల్స్ లేని నెయిల్ పాలిష్‌ని గుర్తించడమే కష్టమని నిపుణులు చెబుతున్నారు. మెథాక్రిలేట్స్‌తో పాటూ, కొన్ని కొన్ని నెయిల్ పాలిష్‌లలో ట్రైఫెనల్ పాస్పేట్ అనే రసాయనం కూడా వుంటుంది.
ఈ రసాయనం ఇంకా ప్రమాదకరమట. దీని కారణంగా హార్మోనల్ సమస్యలు కూడా తలెత్తవచ్చని అంటున్నారు. నేరుగా హార్మోన్స్‌పై ప్రభావం చూపిస్తుందట ఈ కెమికల్.
గోళ్లకే కాదు, వేళ్లకీ ఎఫెక్ట్ సుమా.!
అప్పుడప్పుడూ నెయిల్ పాలిష్ వేసుకున్నా ఫర్వాలేదు కానీ, నిత్యం నెయిల్ పాలిష్ వేసుకునే వారికి, రకరకాల బ్రాండ్లు వాడే వారికి అత్యంత ప్రమాదం వున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నెయిల్ పాలిష్ విరివిగా వాడడం వల్ల గోళ్లు నిర్జీవంగా మారిపోవడం చిట్లిపోవడం.. గోళ్ల వద్ద చర్మం పొడిబారిపోవడమే కాదండోయ్.. గోళ్ల ద్వారా వేళ్లు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయట.
Also Read: Adah Sharma The Kerala Story.. దెబ్బకి దశ తిరిగిపోయింది.!
నెయిల్ పాలిష్ కారణంగా వచ్చిన అలర్జీతో వేళ్లు చచ్చుపడిపోయిన సందర్భాలు కూడా వున్నట్లు మరో సర్వేలో తేలింది.
సో, అమ్మాయిలూ, ఫ్యాషన్ పేరు చెప్పి, మార్కెట్లో దొరికే పిచ్చి పిచ్చి బ్రాండ్ నెయిల్ పాలిష్‌లను విచ్చల విడిగా వాడే ముందు జర శోచాయిస్తే బెటర్.!