Rashmika Mandanna Manager.. అరరె.! రష్మిక మండన్నకి ఏమయ్యింది.? ఎందుకామె ఈసారి కొత్తగా వివాదాల్లోకెక్కింది.?
సినీ జనాలన్నాక విషయం వున్నా, లేకున్నా వివాదాల్లోకెక్కుతుంటారు. అదే మ్యాజిక్కు.! వాళ్ళ పేర్లతో వచ్చే వార్తలకి, గాసిప్పులకి వుండే క్రేజ్ అలాంటిది మరి.!
అసలు విషయమేంటంటే, రష్మిక మండన్న(Rashmika Mandanna) ఇప్పుడు ఒంటరి అయిపోయిందట.! ఆమెను ఓ వ్యక్తి మోసం చేశాడట.
Rashmika Mandanna Manager.. ముంచేశాడా.?
చాలాకాలంగా రష్మిక మండన్న దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి, రష్మిక మండన్నని మోసం చేశాడట. అదీ 80 లక్షలు కొట్టేశాడట.

విషయం ఎలా బయటకు పొక్కిందోగానీ, రష్మిక (Rashmika Mandanna) కంగారు పడింది. మేనేజర్ల చేతుల్లో తారల గుట్టూ మట్టూ దాగి వుంటుందంటారు.!
అందుకే, విషయం మరింత పెద్ద వివాదంగా మారకుండా వుండేందుకు, రష్మిక (Rashmika Mandanna) టీమ్ స్పందించింది.
మోసం కాదు.. మ్యూచువల్గానే విడిపోయార్ట..
జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదంటూ ఇరు వైపుల నుంచీ ఉమ్మడి ప్రకటన ఒకటి మీడియాకి విడుదలయ్యింది.
ప్రొఫెషనల్‌గా ఇన్నాళ్ళూ కలిసి పని చేశామనీ, ఇకపైనా ప్రొఫెషనల్‌గానే వుంటామనీ.. కాకపోతే ఎవరి దారి వారు చూసుకుంటున్నామన్నది ఆ ప్రకటన సారాంశం.

ఇంతకీ, 80 లక్షలు ఎలా కొట్టేశాడబ్బా.? 80 లక్షలు మాత్రమేనా.? అంతకు మించి.. కథ నడిచిందా.?
Also Read: పూజా హెగ్దే కళ్ళల్లో శ్రీలీల, సంయుక్త.. ‘గుంటూరు కారం’ .!
ఏమోగానీ, ప్రస్తుతానికైతే రష్మిక మండన్న ( Rashmika Mandanna ) పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో బిజీగా వున్న దరిమిలా, ఈ సమయంలో ఈ మేనేజర్ గొడవ.. ఒకింత ఆమెకు ఇబ్బదికరమే.