Pawan Kalyan Hungry Cheetah.. అసలు సినిమా టైటిల్ ఏంటి.? ఏమో, రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వలేదు.!
డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న సినిమా ఇది. రీమేక్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రెయిట్ సినిమా కూడా ఇదే.!
‘సాహో’ (Saaho) సినిమాతో బొక్కబోర్లా పడ్డ సుజీత్ (Sujeeth) తెరకెక్కుతోన్న సినిమా ఇది.! ఇంతకీ, ఈ సినిమా టైటిల్ ఏంటి.?
Pawan Kalyan OG నుంచి Hungry Cheetah వరకూ.!
ముందేమో, ‘ఓజీ’ అన్నారు. ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ (Fire Storm Is Coming) అని కూడా అన్నారు.! ‘దే కాల్ హిమ్ ఓజీ’ (They Call Him OG) అని కూడా సెలవిచ్చారు.

ఇవన్నీ పాత వ్యవహారాలు. ఇప్పుడు కొత్తగా, ‘హంగ్రీ చీటా’ అంటూ కొత్త పోస్టర్ విడుదల చేశారు.! ఇంతకీ, సినిమా టైటిల్ ఏంటి.? మళ్ళీ అదే కన్‌ఫ్యూజన్.!
గందరగోళం ఏమీ లేదు, టీజర్ వచ్చేస్తోందంటూ మేకర్స్ చెబుతున్నారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టీజర్ రాబోతోంది.
Also Read: నాన్సెన్స్.! అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డా.?
అద్గదీ అసలు సంగతి.! అన్ని అనుమానాలకీ ఆరోజే నివృత్తి దొరకబోతోంది.! లెట్స్ వెయిట్ ఫర్ ది ‘ఓజీ’ టీజర్.!
ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రియా రెడ్డి (Sriya Reddy) ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది.