Colours Swathi Reddy Divorce.. సినీ నటి ‘కలర్స్’ స్వాతి పెళ్ళి పెటాకులయ్యిందా.? ఇదేం ప్రశ్న.? అది ఆమె వ్యక్తిగత జీవతం.! మరీ, డివోర్స్ గురించి ఇలా అడిగేస్తే ఎలా.?
కొందరు సినీ పాత్రికేయులు ముందస్తుగానే ఆయా సెలబ్రిటీలతో ‘కుమ్మక్కయ్యి’ బుర్ర తిరుగుడు ప్రశ్నలు అడుగుతున్నారా.? అంతేనేమో.!
కలర్స్ స్వాతి మంచి మాటగత్తె. ఈ విషయం అందరికీ తెలిసిందే. గలగలా మాట్లాడేస్తుంది కాబట్టే, బుల్లితెర యాంకర్‌గా రాణించింది. సినీ నటిగానూ మారింది.
Colours Swathi Reddy Divorce.. నే చెప్ప..
డివోర్స్ ప్రశ్న, ఓ సినీ ఎర్నలిస్టు నుంచి రావడంతో, దానికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ, ‘నేను చెప్ప..’ అనేసింది.
కొన్నాళ్ళ క్రితం కలర్స్ స్వాతి పెళ్ళి జరిగింది. పెళ్ళయ్యాక విదేశాల్లో సెటిలైపోయింది. కానీ, ఆ తర్వాత ఆమె ఎప్పుడూ తన భర్తకు సంబంధించిన విశేషాల్ని మీడియతో పంచుకోలేదు.
గత కొన్నాళ్ళుగా ఆమె ఒంటరిగానే వుంటోంది.. అంటే, భర్తకు దూరంగా. సో, డివోర్స్ తీసుకుందా.? అన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే.
Also Read: రష్మికకి ఘోర అవమానం.! ఇంతకీ, ఏం జరిగిందక్కడ.?
మీమ్స్ కోసమా.? వైరల్ కంటెంట్ కోసమా.? అంటూ.. చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ, సినీ ఎర్నలిస్టుని కాస్తంత రెచ్చగొట్టి వదిలేసింది కలర్స్ స్వాతి.
తీరా, డివోర్స్ గురించి ప్రశ్నిస్తే, ‘ఇర్రిలవెంట్’ (సంబంధం లేని విషయం) అంటూ కొట్టి పారేసింది. ప్రతిసారీ, అదే ఎర్నలిస్టు.. సెలబ్రిటీలకు కార్నర్ అయిపోతుండడం గమనార్హం.
కార్నర్ అయితే అయ్యాడుగానీ, బోల్డంత ఫేమ్ వచ్చి పడింది. సినీ ఎర్నలిస్టుల్లో ఇప్పుడు అతగాడే టాప్.!