Home » సినిమా రివ్యూ ‘మారెమ్మ’.! మరీ ఇంతలా విసిగించేశావేంటమ్మా.!

సినిమా రివ్యూ ‘మారెమ్మ’.! మరీ ఇంతలా విసిగించేశావేంటమ్మా.!

by Mudra369 Editorial Desk
0 comments
Maremma Review

Maremma Review.. రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా ‘మారెమ్మ’.!

‘హార్ట్ బీట్’ అనే టీవీ సిరీస్‌తో పాపులర్ అయిన దీపా బాలు కూడా, ఇదే సినిమాతో తెలుగు తెరపైకి తెరంగేట్రం చేసింది.

గత కొంత కాలంగా, తెలుగు సినిమా కొత్త కథల వెంట పడుతోంది. కొత్త కథలు అనడం కంటే, కొత్త కాన్సెప్ట్‌లు.. అనడం కరెక్టేమో.!

రూరల్ రస్టిక్ డ్రామాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పైగా, దానికి దైవత్వమో లేదంటే దెయ్యాల తత్వమో జోడిస్తే, అదనపు అడ్వాంటేజ్ కూడా అవుతోంది.

‘మారెమ్మ’ సినిమా కోసం ఓల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్రామం.. ఆ గ్రామ దేవతకు సంబంధించిన నమ్మకాలు.. వీటన్నిటినీ కలిపి కథగా మార్చారు.

తొలి సినిమాతోనే బరువైన పాత్రని ఎంచుకున్నందకు మాధవ్ ధైర్యాన్ని అభినందించి తీరాలి. సినిమా కోసం బాగానే ఖర్చు చేశారని ప్రోమోస్ చూస్తే అర్థమవుతుంది.

రవితేజ స్వయంగా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో సందడి చేశాడు.. సోదరుడి తనయుడు మాధవ్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు, తెర వెనుకాల రవితేజ చేయాల్సిందంతా చేశాడు.

Maremma Review.. మారెమ్మ కథా కమామిషు ఇదీ..

అనగనగా ఓ ఊరు. ఆ ఊరికి ఓ గ్రామ దేవత. ఆ గ్రామ దేవతకు బలిచ్చేందుకు ఓ దున్న పోతుని పెంచుతారు ఆ గ్రామస్తులు. దున్నపోతుని పెంచే బాధ్యత, మన హీరోగారిది.

ఆ ఊరిలో ఓ విలన్.. హీరోకీ విలన్‌కీ మధ్యన చిన్న గొడవ.. ఈ గొడవ నేపథ్యంలో, ఆ దున్నపోతుని చంపేయాలని చూస్తాడు విలన్. దున్నపోతుని హీరో రక్షించాడా.? లేదా.? అన్నది మిగతా కథ.

స్క్రీన్ మీద మాధవ్ బాగున్నాడు. కాకపోతే, నటనలో ఇంకా చాలా మెచ్యూనిటీ రావాలి. ఇంకాస్త ప్రిపరేషన్ గట్టిగా వుండి వుంటే బావుండేది.

మొదటి సినిమానే కదా.. అని ప్రేక్షకులు జాలి చూపించే పరిస్థితి వుండదు. అదే, బాగా చేస్తే.. ‘మొదటి సినిమానే అయినా చాలా బాగా చేశాడు’ అని చెప్పుకుంటారు.

ఇక, మొదటి సినిమానే అయినా దీపా బాలు వున్నంతలో నటిగా బానే చేసింది. కానీ, తెరపై ఆమె పాత్రకు అంత ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు దర్శకుడు.

చాన్నాళ్ళ తర్వాత సీనియర్ నటుడు వినోద్ కుమార్ తెరపై కనిపించాడు. అతన్నీ దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు.

కథ బాగానే మొదలైనా, ఆ తర్వాత వేగం తగ్గిపోియంది. గందరగోళంగా తయారయ్యింది. సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు.

హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథని అయినా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి వుండాల్సింది. అదీ జరగలేదు. కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. వున్న ఆ కొన్ని కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేశాయి.

పేలవమైన కథలో నటీనటులు మాత్రం ఏం చేయగలరు.? సాంకేతిక వర్గం కూడా ‘మమ’ అనిపిస్తారు. ఓవరాల్‌గా చూస్తే, ‘మారెమ్మ’ విసిగించేసింది.

క్లయిమాక్స్‌లో సహజత్వం కోసం ఏదో ప్రయత్నం చేశాడుగానీ, దర్శకుడు ఒకింత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని.. మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసి వుండాల్సింది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group