Janasenani Pawan Kalyan Journey.. చట్ట సభల్లోకి అడుగు పెట్టాలంటే, ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే లేదు.
కొనుక్కుంటే మార్కెట్లో సులువుగానే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు దొరుకుతుంది.! కాకపోతే, కొంత ఖర్చవుతుందంతే.
కొన్నిసార్లు ఖర్చుతో పని లేకుండానే ఎమ్మెల్సీ లేదా, ఎంపీ (రాజ్యసభ) సీటు దొరుకుతుంది. చాలామంది సినీ ప్రముఖులు ఇలాగే చట్ట సభల్లోకి అడుగు పెట్టారు కూడా.!
మరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు.? ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు. ఆయనకి అలా చట్ట సభల్లోకి అడుగు పెట్టడం ఇష్టం లేదంతే.
ఓట్లు కొనుక్కుంటే, ఎన్నికల్లో గెలిచి చట్ట సభల్లో అడుగు పెట్టొచ్చు. అది కూడా ఇష్టపడే వ్యక్తి కాదు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).
Janasenani Pawan Kalyan Journey.. ఎన్నికల్లో గెలవడం అంటే అది కాదు..
2014 ఎన్నికల్లో జనసేనాని పోటీ చేసినా, 2019 ఎన్నికల్లో ఓట్లు కొనుక్కునేందుకు పవన్ కళ్యాణ్ ప్రకటించినా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ రాజకీయం ఇప్పుడు వేరే లెవల్లో వుండేది.
‘పార్టీలు, నాయకులు గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి..’ అన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతం. ‘ప్రభువులు కాదు, ప్రజలు పల్లకీ ఎక్కే పరిస్థితి రావాలి’ అంటారాయన.
కానీ, ఇప్పుడున్న రాజకీయాల్లో అది సాధ్యం కాదు.! అందుకే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చట్ట సభల్లోకి ఎప్పుడు ఎలా అడుగు పెడతారన్నదానిపై కొంత గందరగోళం వుండడం సహజమే.
Also Read: Covid JN1 Variant: భయపడొద్దంటే.! ప్రాణాలు పోయినా ఫర్లేదా.!
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క.. అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజల్లోనూ కొంత మార్పు కనిపిస్తోంది. ఆ మార్పు కోసమే జనసేనాని రాజకీయం చేస్తున్నారు.
సో, సగర్వంగా జనసేనాని పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో గెలిచి, చట్ట సభల్లోకి అడుగు పెట్టబోతున్నారు.
కేవలం ఎమ్మెల్యేగానా.? మంత్రిగా కూడానా.? అన్నీ కలిసొచ్చి, ముఖ్యమంత్రిగా చట్ట సభల్లోకి అడుగు పెడతారా.? అన్నది ముందు ముందు తేలుతుంది.