Table of Contents
Joseph Vijay KTR Jagan.. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీయార్ భేటీ అయ్యారు.!
కాదు కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకి టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ హాజరయ్యారు.
వివాహ వేడుక అంటే, బంధు మిత్రులకు ఆహ్వానం పలకడం సహజం. పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకి హాజరై, నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.
ఇక్కడ, ఇలాంటి కార్యక్రమాల్లో రాజకీయ పరమైన చర్యలకు ఆస్కారం వుంటుందా.? అంటే, ఖచ్చితంగా ఎంతో కొంత రాజకీయాల ప్రస్తావన వచ్చే వుండొచ్చు.
నిజానికి, రాజకీయాలే మాట్లాడుకోవాలనుకుంటే, వాటికి వేరే వేదికలుంటాయ్.. సో, దీన్ని కేవలం వివాహ వేడుకలో, ప్రముఖుల కలయికగానే చూడాలి.
అయితే, వైసీపీ శ్రేణులు ఈ కలయికని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే కాంబినేషన్.. అంటూ ప్రచారం చేస్తుండడంతో, సహజంగానే రాజకీయ ప్రత్యర్థుల నుంచి కౌంటర్ ఎటాక్ వస్తుంది.
Joseph Vijay KTR Jagan.. అటు మద్రాసు నుంచీ.. ఇటు తెలంగాణ నుంచీ..
ఇక్కడ చిత్రమేంటంటే, ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఆ తర్వాత, హైద్రాబాద్‌లోని ఓ భాగంతో కలిసి, ఆంధ్ర ప్రదేశ్ అయ్యింది.
ఆ భాగం, వేరు పడి తెలంగాణ రాష్ట్రంగా అవతరిస్తే, ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన, ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు సరికొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా మిగిలింది.
ఇప్పుడీ విభజన ప్రస్తావన ఎందుకంటే, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీయార్.. కలవడంపై చర్చ జరుగుతోంది కాబట్టి.
ఈ కలయిక, ముందు ముందు దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాంటి రాజకీయ మార్పులకి కారణమవుతుంది.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఇదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో తూలనాడింది. జగన్ మీద రాళ్ళ దాడి కూడా చేసింది.. అది గతం.
తమిళ రాజకీయం ముందర తెలుగు రాజకీయం ఏమవుతుందో..
తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నంగా వుంటాయి. దేశ రాజకీయాల్లో తమిళనాడుది చాలా ప్రత్యేకమైన వ్యవహారం. సో, తమిళనాడు సాయం, తెలుగు రాష్ట్రాలకి రాజకీయంగా వుంటుందనుకోవడం హాస్యాస్పదం.
గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీయార్ కూడా, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చేతులు కలిపే ప్రయత్నం చేశారు.. ఫలించలేదు.
చిత్రంగా, ఆ స్టాలిన్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీవీకే విజయ్‌తో, కేటీయార్ చేతులు కలుపుతున్నారు.
మర్యాదపూర్వక ‘చేతులు కలయిక’ అయితే వింతేమీ లేదు. రాజకీయ కలయిక అయితేనే, వ్యవహారం వేరేలా వుంటుంది.
జోసెఫ్ విజయ్.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని..
అన్నట్టు, తమిళనాడు సీఎం విజయ్ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. ఆ విషయాన్ని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు కూడా.!
రాజకీయాల్లో ఈ తరహా స్నేహాలు సర్వసాధారణం.! అన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్‌కి కలిసొస్తాయని అనుకోలేం.
తమిళనాడు ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ప్రచారం చేయడం, తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు ప్రముఖుల ఎన్నికల ప్రచారం.. ఇదంతా ఎప్పటినుంచో జరుగుతున్న వ్యవహారమే.
ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.! ఏమో, గుర్రం ఎగరావచ్చు.!