Table of Contents
Varsha Bollamma Divorce.. మనుషులెందుకు చచ్చిపోతారు.? పుడతారు కాబట్టి.! అసలు మనుషులెందుకు పుడతారు.? చచ్చిపోవాలి కాబట్టి.!
ఇదేం వాదన.? దీన్నే పిచ్చి వాదన అంటారు.! మతి చెడిన వాదన ఎలాగైనా వుండొచ్చు. అందుకే, అర్థం పర్థం లేని వాదన అది.!
అలాంటి వాదనే, విడాకుల గురించి కూడా ఒకటి జరుగుతోంది.! అసలు విడాకులకు కారణమేంటి.? అన్న ప్రశ్నకు ‘పెళ్ళి వల్లే విడాకులు’ అనే సమాధానం వస్తోంది నిస్సిగ్గుగా.!
సరదాకి మాత్రమేనా.?
జస్ట్ సరదాకి.. అని సరిపెట్టుకుందామా.? పెళ్ళి, విడాకులు.. అంటే, మరీ అంత కామెడీ అయిపోయిందా.? అయిపోయింది మరి.!
పొద్దున్న పెళ్ళి, సాయంత్రం విడిపోవడం.. ఆ మరుసటి రోజే విడాకుల ఆలోచన చేయడం.. ఇదీ ఇప్పుడు నయా ట్రెండ్.

ఆగండాగండీ.. అందరూ అలా లేరు.! వన్ నైట్ స్టాండ్.. ఆలోచనలకే జీవితాన్ని పరిమితం చేసేసుకుంటున్న కొందరి పైత్యమిది.
‘కలిసి జీవించలేకపోతున్నాం.. కలిసే చచ్చిపోతాం..’ అంటూ బలవన్మరణాలకు పాల్పడే భగ్న ప్రేమికులు వున్నట్లే.. ‘కలిసి బతకలేకపోతున్నాం.. అందుకే, విడివిడిగా బతికేస్తాం..’ అనుకుంటున్నారు కొందరు.
విడిపోయి కలిసుంటారట..
భార్యాభర్తలుగా జీవించలేరుగానీ, విడాకులు తీసుకుని స్నేహితుల్లా జీవించేస్తారట.. కొందరి పైత్యపు వాదన ఇలా తగలడుతోంది.
Also Read: ముచ్చటగా మూడోది.! జాన్వీ కపూర్ ఖాతాలో ఇంకోటి.!
తల్లి దండ్రులుగా తమ పిల్లలకు ప్రేమను పంచుతారటగానీ, భార్యాభర్తలుగా వుండలేరట.. ఇంకొందరు. చెప్పుకుంటూ పోతే, ఇలాంటి వికారాలు చాలానే.
అసలు, ఇక్కడ టాపిక్ ఏంటి.? ఈ టాపిక్‌లోకి నటి వర్ష బొల్లమ్మ ఎందుకు వచ్చింది.? అంటే, సోషల్ మీడియాలో ‘విడాకులకు కారణం ఏంటి.?’ అని ఎవరో ప్రశ్నిస్తే, ‘పెళ్ళి’ అని సమాధానమిచ్చింది మరి.!
Varsha Bollamma Divorce.. అసలా ఉద్దేశ్యం వుందా.? లేదా.?
సో, వర్ష బొల్లమ్మకి పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదన్నమాట.! మరీ అంత తొందరొద్దు.! జస్ట్ సరదాకి ఆ కామెంట్ ఆమె చేసి వుండొచ్చు.

సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ అడపా దడపా పడేస్తే, అభిమానులు తమ తమ హ్యాండిల్స్‌కి కనెక్ట్ అయిపోతారన్నది ఇలాంటి సెలబ్రిటీల ఉద్దేశ్యం కావొచ్చు.
మరి, ట్రోలింగ్ సంగతో.? ఎవరెలా ఏకిపారేసినా, పాపులారిటీ కోసం వెకిలి వేషాలైతే తప్పవ్.! కాదేదీ పాపులారిటీ పెంచుకోవడానికనర్హం.!